ప్రభాస్ పై కామెంట్లు చేస్తున్న పవన్ ఫ్యాన్స్

January 07, 2016 | 03:40 PM | 4 Views
ప్రింట్ కామెంట్
prabhas-pawan-kalyan-fans-war-in-social-media-niharonline

ఏ ముహుర్తాన బాహుబలిలో నటించాడో కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైఫ్ భీభత్సమైన టర్న్ తీసేసుకుంది. ఒక్క సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మనోడి గురించి డిస్కషన్ ప్రారంభమైంది. విదేశీ బ్రాండ్లు కూడా అంబాసిడర్ గా పనిచేయాలంటూ కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమయ్యాయి. అన్ని ఆడియో పంక్షన్లు, ఇతర వేడుకల్లో డార్లింగ్ దే సందడి. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులతోపాటు, ఇతర భాషల్లో నటించేందుకు ప్రభాస్ ఆఫర్లు వస్తున్నాయి.  ఇంకా బాహుబలి-2 వచ్చేసరికి రేంజ్ ఇంకొంచెం పెరుగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

పాజిటివ్ ఉన్న చోటే నెగటివ్ ఉన్నట్లు, పేరు పెరగటంతోపాటు ఇతర హీరోల ఫ్యాన్స్ కళ్లలో కూడా పడ్డాడు. ఆ మధ్య ప్లెక్సీల వివాదంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ తలపడిన విషయం తెలిసిందే. గొడవ ఎంత దాకా వచ్చిందంటే రోడ్ల మీద పడి కొట్టుకుని పంచాయితీ పోలీస్ స్టేషన్ కి వెళ్లేదాకా. ఆయా హీరోలు ఆ ఫ్యాన్స్ కి ఒకటికి రెండుసార్లు రిక్వెస్ట్ చేస్తే తప్ప వారు శాంతించలేదు. అయితే ముగిసిందనుకున్న ఈ ఫ్యాన్స్ వార్ మళ్లీ మొదలైనట్లు సంకేతాలు అందుతున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి కాస్త వ్యతిరేకత ఉన్న పోస్ట్ లు చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ‘‘ప్రభాస్ పెద్ద కలరేం కాదని, ఆరడుగులు ఉన్నా పెద్ద అందగాడే కాదని, అసలు బాహుబలిలో చేసింది యాక్టింగే కాదని కామెంట్లు చేస్తున్నారు. అదంతా కేవలం అదృష్టంతో వచ్చిందని, రాజమౌళి లేకపోతే అదంతా సాధ్యమయ్యేదే కాదని పోస్ట్ లు వెలుస్తున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే... ఇందులో పవన్ లేడీ ఫ్యాన్స్ కూడా ఉండటం. వీటికి మండిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ దానికి ధీటుగానే స్పందిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా బూతులతో విరుచుకుపడుతున్నారు. తమ హీరోకు వచ్చిన క్రేజ్ ను చూసి ఓర్వలేకనే ఇలా కామెంట్లు చేస్తున్నారంటూ తిట్టేసుకుంటున్నారు. మీ హీరో రాబోయే సినిమా(సర్దార్ నుద్దేశించి) మా హీరో సినిమాలో పదో వంతు వసూలు చేసి చూపించినా చాలు అంటూ చురకలు అంటిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నడుస్తోంది. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుని మన హీరోలు సినిమాలు తీస్తారు, బయట వారు కలుసుకున్నప్పుడు బాగానే ఉంటారు. కానీ, మధ్యలో ఈ ఫ్యాన్సే ఇలా కొట్టుకుచావటం ఎందుకో?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ