ప్రభాస్ కు ఇప్పటి వరకూ నటించిన హీరోయిన్లందరూ బోర్ కొట్టేశారట. ఒక కొత్తమ్మాయిని తీసుకురమ్మని దర్శకుడు సుజిత్ కు సూచించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ అమ్మాయిని హీరోయిన్ గానే సరిపెడతాడా? లేక పెళ్ళి ప్రపోజల్స్ కు కూడా వెళతాడా? అనేది సందేహం కలుగుతోంది. బాహుబలి’ విడుదల తరువాత యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘రన్ రాజా రన్’ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ ప్రతిభ నచ్చడంతో ప్రభాస్ ‘బాహుబలి’ తరువాత ఈ దర్శకుడి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించబోతున్నారట. ప్రభాస్ ఎందుకు ఇలా అంటున్నాడో చాలామందికి అర్ధం కావడం లేదు. తన సినిమా బడ్జెట్ ను తగ్గించాలి అన్న ఉద్దేశ్యంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడా? లేదంటే ఒకేసారి మూకమ్మడిగా టాప్ హీరోయిన్స్ పై ప్రభాస్ కోపం పెంచుకున్నాడా అర్థం కావడం లేదు. ఏదేమైనా ఇప్పుడు హీరోయిన్స్ కు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఒక కొత్తమ్మాయికి ఛాన్స్ ఇస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా అనుకుని ఉండవచ్చు.