యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ యేడాది రానున్న ప్రిస్టిజియేస్ మూవీ బాహుబలి ద్వారా ప్రభాస్ ఉత్తరాదిని పలకరించనున్నాడు. అయితే అంతకుముందే యాక్షన్ జాక్సన్ లో మనోడు సోనాక్షి సిన్హాతో కలిసి ఒక పాటలో ఓ 12 సెకన్లపాటు కనువిందుచేశాడు. చిత్రం ఫలితం ఎలా ఉన్న రెండేళ్ల తర్వాత తమ హీరో స్క్రీన్ పై చిందులేయండం, అదీ కూడా బాలీవుడ్ చిత్రంలో కావటంపై ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. అయితే దీనివల్ల పెద్దగా ప్రభాస్ కెరీర్ కి ఒరిగింది ఏం లేదంటున్నాడు కొరియోగ్రఫర్ కమ్ దర్శకుడు ప్రభుదేవా. అసలు ఆ డాన్స్ బిట్ ను జనాల్లేవ్వరు పట్టించుకోలేదని డైరక్టుగా చెప్పి గాలి తీసేశాడు. దీంతో బాహుబలి ప్రమోషన్ కి ప్రభాస్ బదులు రానాను ఉపయోగించుకోవాలని బాహుబలి టీం భావిస్తుందట. ఉత్తరాదికి అస్సలు తెలియని ప్రభాస్ కంటే ఒకటి రెండు చిత్రాలు తీసిన రానా ను వాడుకోవాలని డిసైడయ్యిందని సమాచారం. ఇక ఈ నిర్ణయంతో ప్రభాస్ హర్టయ్యాడట. అంతకన్నా ఎక్కువగా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రభుదేవే ఇలా తన గురించి మాట్లాడటంతో తెగ ఫీలయిపోతున్నాడని ఫిలింనగర్ సమాచారం.