పిల్లలతో ప్రభుదేవ న్యూ ఇయర్ లాస్ వెగాస్ లో

December 26, 2014 | 05:43 PM | 33 Views
ప్రింట్ కామెంట్

ఎంత బిజీగా ఉన్నా, భార్య నుంచి విడిపోయినా ప్రభుదేవ పిల్లలను తరచూ కలుస్తుంటాడు. వారితో చాలా ఎంజాయ్ చేస్తాడు. ఏ మాత్రం సమయం దొరికినా ఎక్కువ శాతం వాళ్ళతోనే గడుపుతాడు. ఈ మధ్యే దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ‘సింగ్ ఈజ్ బ్లింగ్‘ సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఆ తరువాత ఎబిసి 2 సినిమా షూటింగ్ కోసం లాస్ వెగాస్ వెళ్ళాడు. ఇప్పుడు పిల్లలతో న్యూ యియర్ అమెరికాలో గడపాలని ఉద్దేశంతో వారిని లాస్ వెగాస్ కు రప్పించుకున్నాడు. ఎంత బిజీగా ఉన్నా వారికోసం సమయం కేటాయించడం బట్టి చూస్తే ప్రభుదేవకు పిల్లలపై ఉన్న ప్రేమ ఎంతో ఇట్టే తెలిసిపోతుంది కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ