సర్దార్ పై అంత పగ ఎందుకు?

April 07, 2016 | 02:34 PM | 3 Views
ప్రింట్ కామెంట్
who-spread-nagative-talk-to-Sardaar Gabbar-Singh-niharonline

ఈ శుక్రవారం ఉగాదితోపాటు తెలుగు రాష్ట్రాల్లో మరో పండగ వాతావరణం సృష్టించేందుకు రెడీ అయిపోతున్నాడు పవర్ స్టార్. సర్దార్ గబ్బర్ సింగ్ బాహుబలిని మించి కనీవిని ఏరుగని రీతిలో రికార్డుస్థాయి దేశాల్లో రిలీజైపోతుంది. అల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఐదురోజుల దాకా ఫుల్ అయిపోయాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా బాగానే ఉంది. కానీ, మొదటి నుంచి చిత్రం పై నెగటివ్ టాక్ ను క్రియేట్ చేస్తూ వస్తోంది ఓ గ్రూప్. గతంలో అత్తారింటికి దారేది చిత్ర లీక్ వ్యవహారంలో కూడా ఈ వర్గం వారిదే చెయ్యి ఉందనే టాక్ కూడా.

                                                  సర్దార్ విషయంలో ముందుగా విడుదలైన ట్రైలర్ లో అసలు పసే లేదంటూ ఓ వాతావరణాన్ని సృష్టించింది. ఇక ఆడియోపై చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. గతంలో దేవీ పవన్ సినిమాలు మ్యూజికల్ గా ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. కానీ, ఈ చిత్రం పాటలు అంతగా పేలలేదని చెప్పుకొచ్చాయి. సెన్సార్ రిపోర్ట్ సీక్రెట్ గా ఉంచినప్పటికీ కథలో అసలు మ్యాటరే లేదంటూ లీక్ లు చేయటం మొదలుపెట్టింది. ఖలేజా, కిక్-2ల మాదిరిగానే రతన్ పూర్ అనే ఓ ఊరిని దుష్టుల బారి నుంచి కాపాడే రక్షకుడిగా పవన్ ఇందులో కనిపించబోతున్నాడని చెప్పేసింది. ఇక సినిమా మొత్తం ఓవర్ యాక్షన్ స్టంట్స్, కథ బిలో యావరేజ్ తోపాటు, ఓన్లీ పవన్ ఫ్యాన్స్ కోసమే తీశాడేమో అన్నట్లుగా అనిపిస్తుందని కథనాలు వెలువరించింది. కేవలం ఓపెనింగ్స్ కోసమే ఇన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారే తప్ప సినిమాలో అంత మ్యాటర్ ఏం లేదంటూ ఊదరగొడుతుంది. ఇక హిందీ రిలీజ్ పై కూడా అవాక్కులు, చవాక్కులు పేల్చింది. చూద్దాం... వీటన్నింటిని సర్దార్ ఎలా తట్టుకుని నిలబడతాడో? అయినా కంటెంట్ ఉన్న సినిమాలను ఇలాంటి నెగిటివ్ కామెంట్లు ఎన్ని వచ్చిన ఆపలేవన్న సంగతి వారికి అర్థం కావట్లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ