‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నా’రన్న సామెత ఇటీవల హీరోయిన్ల విషయంలో బాగా జరుగుతోంది. హీరోలకు నటనా పిరియడ్ ఎక్కువ అదేంటో హీరోయిన్ల విషయంలో మాత్రం ఇది జరగడం లేదు. ముప్ఫై ఏళ్ళు దాటారంటే... సైడైపోవాల్సిందే. ఇప్పటికే ముందు జాగ్రత్తగా పలువురు జువెలరీ, బట్టల షాపులు, మాల్స్ వంటి ఇతర బిజినెస్ ల్లోకి దిగి పోయారు. అది ఇప్పుడు ప్రియాంక చోప్రా విషయంలోనూ జరగబోతోంది. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని మంచి మూవీ నంబర్స్‌తో స్టార్‌డమ్ సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా కొత్తరూట్లు వెదుకుతోందట. తోటి హీరోయిన్లు.. అనూష్కా శర్మ, సోనాక్షి సిన్హా తదితరులు సొంత ప్రొడక్షన్ కంపెనీలు స్టార్ట్ చేయడంతో ప్రియాంకా లుక్స్ అటువైపు మళ్లించిందని సమాచారం. త్వరలోనే స్టార్ట్ చేయనున్న ఈ ప్రొడక్షన్ కంపెనీకి పర్పుల్ పెబల్ పిక్చర్స్ అని పేరు కూడా పెట్టింది. ఆడియెన్స్ పల్స్ తెలుసుకుని వాళ్ళకు నచ్చేవిధంగా కంటెంట్ అందించాలన్న ఎయిమ్‌తోనే ప్రియాంక ఈ డెసిషన్ తీసుకున్నదట. మహిళలే ప్రొడ్యూసర్లుగా విజయం సాధించిన ఎన్ హెచ్ 10, తనూ వెడ్స్ మనూ రిటర్న్స్ , కహానీ, పికూ లాంటి సినిమాలకు హిట్ టాక్ రావడంతో ప్రియాంకా చోప్రా కూడా ప్రొడక్షన్ వైపు టర్న్ తీసుకోవడానికి కారణమట. అలాగని కేవలం బిగ్ బడ్జెట్ సినిమాలు కాదు.. లో బడ్జెట్ మూవీలను, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలను కూడా ఎంకరేజ్ చేస్తానంటోంది. హై కంటెంట్, లో బడ్జెట్‌తో చిన్న చిన్న సినిమాలు తీయాలన్నది తన ప్లాన్ అంటోంది ప్రియాంకా చోప్రా.