పోస్టర్స్ తో యువతను మెస్మరైజ్ చేసిన కేరింత సినిమా కోసం కాలేజీ స్టూడెంట్స్ యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సాయి కిరణ్ అడవి దర్శకుడు. మిక్కి జె మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం (మే 25న) హైదరాబాద్ లో జరిగింది. సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్విలతోపాటు మరికొందరు కొత్త నటీనటులని దిల్ రాజు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, సుకుమార్, స్రవంతి రవికిషోర్, ఎమ్మెస్ రాజు, పరుచూరి ప్రసాద్, దామోదర ప్రసాద్, వంశీ పైడిపల్లి, సునీల్, గోపీచంద్ మలినేని, మిక్కి జె మేయర్, సాయి కిరణ్ అడవి, దిల్ రాజు, రామజోగయ్య శాస్రి, సందీప్ కిషన్, అడవి శేష్, సుమంత్ అశ్విన్ తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. బిగ్ సిడిని అల్లు అరవింద్ ఆవిష్కరించారు. సుకుమార్ ఆడియో సిడిలను ఆవిష్కరించి అల్లు అరవింద్ కు అందజేశారు. థియేట్రికల్ ట్రైలర్ ను సునీల్ విడుదల చేశారు.
స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ… ‘అమృత’ విడుదల సమయంలో రాజు పెద్ద నిర్మాత అవుతాడని మనస్పూర్తిగా అనుకున్నాను. ఎప్పుడూ పెద్ద హీరోలతో అలాంటి సినిమాలు కాకుండా, ఇలా సబ్జెక్టును నమ్ముకుని తీసిన సినిమాలు, ఇవి సక్సెస్ చేయడం, అందులో తృప్తి డబ్బుతో వేల కట్టలేం అని అన్నారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. యంగ్ టాలెంట్ గుర్తించి, ఎంకరేజ్ చేయడంలో దిల్ రాజు ముందుంటారు. కేరింత ద్వారా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్నారు. కథ దగ్గర నుండి ప్రతి విషయంలో రాజుగారి జడ్జ్మెంట్ 99 శాతం కరెక్ట్ గా ఉంటుంది. నిన్న ట్రైలర్ చూపించారు. చాలా బాగుంది.
దిల్ రాజు మాట్లాడుతూ… సినిమా విజయం సాధిస్తే చాలామంది మెచ్చుకుంటారని, ఫలితం మారితే వారిలోనూ మార్పు వస్తుందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కేరింతల వెనుక ఎంతో కష్టముందని చెప్పారు. కొత్త బంగారులోకం తర్వాత అంతా కొత్తవాళ్ళతో సినిమా తీద్దామని అనుకుంటున్నా సమయంలో సాయి కిరణ్ అడవి ఆఫీసుకు వచ్చి రెండు కొట్లలో సినిమా తీద్దామని చెప్పాడు. వెంటనే టెంప్ట్ అయ్యా. సాయి తీసిన ‘వినాయకుడు’ సినిమాను నేను ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేశాను. అది ఎంత విజయం సాధించిందో అందరికీ తెలుసు. తను చెప్పిన కథ విన్నాను, నచ్చింది. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, అరుణ్ లను హీరోలుగా ఫిక్స్ చేసి ఫోటోషూట్ కూడా చేశాం. ఎక్కడో చిన్న సందేహం. ప్రేక్షకులలో వీళ్ళకు ఓ గుర్తింపు ఉంది. సాయి అంటే మెగాస్టార్ మేనల్లుడు. ప్రేక్షకులలో అతనిపై అంచనాలు ఉంటాయి. ఇది కరెక్ట్ కాదని భావించి.. కొత్తవాళ్ళ కోసం ఆడిషన్స్ చేసి నటీనటులను ఎంపిక చేశాం. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ మెచ్యూర్ పెర్ఫార్మన్స్ చేయాలి. అప్పుడు ఎమ్మెస్ రాజు గారి అబ్బాయి సుమంత్, శ్రీదివ్యలను సెలెక్ట్ చేశాం. మిగతా అన్ని పాత్రలకు కొత్తవాళ్ళను తీసుకున్నాం. 30 రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఎడిటింగ్ రూంలో చూశాం. గంట సినిమా రెడీ అయ్యింది. మేము అనుకున్నది తెర మీద రాలేదు. ఎక్కడ తప్పు జరిగిందో చూసుకుని తర్వాత 60 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. అలాగే మా ఫ్యామిలీ బ్రాండ్ కూడా ఉండేలా చూసుకున్నాం. సినిమాలో ఆరు పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు. కొత్త బంగారు లోకం తర్వాత ఇలాంటి సినిమా చేసే అవకాశం రాలేదు. ఇకపై ప్రతి ఏడాది ఇలాంటి సినిమాను తీయలనుకుంటున్నాం. సినిమా తీయడం ఎలాగో ఎందరికో నేర్పించిన గొప్ప నిర్మాత మూవీ మొఘల్ డి.రామానాయుడు గారికి ఈ చిత్రం అంకితం ఇస్తున్నాం.
సందీప్ కిషన్ మాట్లాడుతూ… ఇద్దరు వ్యక్తులతో మాట్లాడడానికి భయపడతాను. ఒకరు గౌతమ్ మీనన్, మరొకరు దిల్ రాజు. నేను నటుడు కావడానికి ఆర్య సినిమా ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో నటించాలేకపోయినా ఆడియోకి హాజరవడం హ్యాపీగా ఉంది. దిల్ రాజు సంస్థ కొత్తవాళ్ళను పరిచయం చేయడం గొప్ప విషయం. దిల్ రాజు గారు ప్రేమించి చేసిన సినిమా ఇది. పెద్ద విజయం సాధించాలని కోరుతున్నాను. అని అన్నారు.
కొరియోగ్రాఫర్ విజయ్ మాట్లాడుతూ.. రాజు గారిది గోల్డెన్ హ్యాండ్ అని అందరికి తెలుసు. ఆయన బ్యానర్ నుండి ఇంట్రడ్యూస్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్క పాట చేస్తే చాలనుకున్నాను, అన్ని పాటలకూ అవకాశం ఇచ్చారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. సినిమా ఆల్రెడీ చూశాను. చూస్తునప్పుడు స్కూల్, కాలేజీ, ఫ్యామిలీ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. రాజుగారు సినిమా చేస్తే డబ్బు కంటే పేరు తెచ్చుకోవాలని చూస్తారు. అలాంటి సినిమాలో కేరింత కూడా ఒకటవుతుంది. సుమంత్ అశ్విన్, శ్రీదివ్యలు బాగా నటించారు. అది మనకు తెలుసు. నూకరాజు, భావన, సిద్దార్ధ్, ప్రియా పాత్రధారులు తమ నటనతో సర్ ప్రైజ్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ పేర్లతో గుర్తుండిపోతారు.
అబ్బూరి రవి మాట్లాడుతూ… రాజు గారు ఈ కథ మీద 50 లక్షలు ఖర్చుపెట్టారు. సినిమా విజయానికి కథ ముఖ్యం అని నమ్మే వ్యక్తి. బొమ్మరిల్లు తర్వాత అంతలా కథ కోసం కష్టపడ్డారు. సాయి చాలా సౌమ్యమైన దర్శకుడు. సినిమాను ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసే నిర్మాత రాజు గారు. వీరిద్దరి కలయికలో సినిమా బాగా వచ్చింది. కాలేజీలో ప్రతివాడికి ఓ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ కు ఓ కథ ఉంటుంది. అలాంటి బ్యాచ్ క
ఈ చిత్ర దర్శకుడు సాయి కిరణ్ అడవి మాట్లాడుతూ.. సినిమా పూర్తవడానికి చాలా మంది సహకరించారు. వారి సహకారంతో ఇంత మంచి సినిమా వచ్చింది. మిక్కి జె మేయర్ అద్బుతమైన సంగీతం ఇచ్చారు. రాజుగారు బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్. సినిమా అంటే ఎంతో ప్రేమ. మంచి సినిమా రావడం కోసం కష్టపడతారు. నటీనటులు అద్బుతంగా నటించారు. వాళ్ళ క్యారెక్టర్స్ పేర్లతో పిలిచేవాళ్ళం. అంత బాగా నటించారు. అని అన్నారు.
మిక్కి జె మేయర్ మాట్లాడుతూ.. మరోసారి రాజుగారి సంస్థలో పని చేయడం చాలా అనందంగా ఉంది. రామజోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. నటీనటులందరూ బాగా నటించారు అని అన్నారు. ఈ సందర్భంగా తన బృందానికి అభినందనలు తెలిపారు.
హీరో సునీల్ మాట్లాడుతూ.. రాజు గారు చిన్న సినిమా తీయలేరు. చిన్న సినిమా తీద్దామని స్టార్ట్ చేసి పెద్ద సినిమాగా తీసి పెద్ద కలెక్షన్స్ వచ్చేలా చేస్తారు. మంచి మనసున్న వ్యక్తి. సుకుమార్ మాట్లాడుతూ… దిల్ సినిమా తర్వాత ఒక మోంటేజ్ చెప్పగానే నువ్వే దర్శకుడివి అని చెప్పారు. నా మీద ఎంత కాన్ఫిడెన్స్ అనుకున్నాను. తర్వాత టీంలో ప్రతి ఒక్కరూ దర్శకులవుతున్నారు. అప్పుడు తెలిసింది ఆయన మీద ఆయనకు కాన్ఫిడెన్స్ అని. ఆయనకు కావలసింది మాలాంటి వారిలో వెతుకుంటారు. మిక్కి సంగీతం నాకు ఇష్టం. ఈ సినిమాలో నటించిన వారందరికీ అల్ ది బెస్ట్’ అని అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రాజు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాను రామానాయుడు గారికి అంకితం ఇస్తున్నాను అనగానే గుండె జల్లుమంది. 70, 80, 90లలో ఎవరు సినిమా తీద్దామని వచ్చినా ఒక రామానాయుడు అవ్వాలని కోరుకునేవారు. ఎందరిలో స్ఫూర్తి నింపిన వ్యక్తికి అంకితం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటీవల ఓ వ్యక్తి ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాత ఎవరు అంటే దిల్ రాజు అని నిజాయితీగా సమాధానం చెప్పాను. ఇన్ని గొప్ప సినిమాలు తీసిన నేను, నన్ను దాటి మరొకరి గురించి ఎందుకు చెప్పాను అంటే నేను గమనించిన లక్షణాలు మనసులో అలా ఉన్నాయి. దానికి కారణాలు. కథను ఎంపిక చేసుకునే తీరు, ఆ కథను తెరమీదకు తీసుకురాగల నేర్పు, అతని వ్యక్తిత్వం. గొప్ప కథను గొప్ప సినిమా అవుతుందని ఊహించడం ప్రత్యేక నైపుణ్యం. అందరికి అర్ధం కాదు. గొప్ప కథలు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. దర్శకుడికి, నిర్మాతకు మధ్య జర్నీ కుదిరినపుడు గొప్ప సినిమాలు వస్తాయి. ఈ కథను విన్న తర్వాత చాలా ఎగ్జయిట్ అయ్యాను. రాజు, గొప్ప కథ నీ చేతిలో ఉంది. అంతా కొత్తవాళ్ళతో సినిమా తీయడం కష్టం అని చెప్పాను. కొన్ని రోజులు షూటింగ్ అయిన తర్వాత ‘కేరింత’ ఏమైందని అడిగితే.. జరగడం లేదు సర్. అనుకున్న కెమిస్ట్రీ రావడం లేదు. అని చెప్పాడు. తీసిన సినిమా చూసుకుని నువ్వు అనుకున్నది వస్తుందా..? లేదా..? జడ్జ్ చేయడం గ్రేట్ సక్సెస్. అది నిర్మాతకు, దర్శకుడికి ఉంటే సినిమా సక్సెస్. అది తెలిసిన బహుకొద్ది మందిలో రాజు ఒకడు. చాన్నాళ్ళ తర్వాత మంచి తెలుగు పాటలు విన్నామనే ఫీలింగ్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం బాగుంది. మిక్కి ఈరోజు హీరో. నటీనటులకు అల్ ది బెస్ట్. అని అన్నారు.