‘బ్రూస్ లీ’ వాయిదా కోరుతూ బహిరంగ లేఖ

October 09, 2015 | 05:22 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Chiranjeevi-Voice-Over-to-Rudramadevi-niharonline.jpg

బాహుబలి సినిమా రిలీజ్ సమయంలో మహేష్ శ్రీమంతుడు రిలీజ్ ఆపమని కోరుతూ ఆ చిత్ర నిర్మాతలు అడగడంతో, మహేష్ బాబు శ్రీమంతుడు రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు రుద్రమ దేవి విషయంలోనూ అలాగే జరగాలని కొందరు మనసులో అనుకుంటున్నప్పటికీ, ఒక నిర్మాత మాత్రం బహిరంగంగా కోరుతున్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ అనే నిర్మాత (రాంగోపాల్ వర్మతో ‘ఐస్ క్రీమ్’ సిరీస్ చేశారు) గుణ శేఖర్ బాసటగా నిలవాలనుకుంటున్నారు. అందుకే ‘రుద్రమదేవి’కి పెట్టిన పెట్టుబడి వెనక్కు రావాలంటే ఈ సినిమా కనీసం నాలుగు వారాలు థియేటర్లలో ఆడాలని ఆశిస్తున్నారు.  ఈ నిర్మాతకు రుద్రమదేవి సినిమాకు ఏ సంబంధం లేనప్పటికీ, గుణశేఖర్ కష్టం చూసి ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ తన వంతుగా ఏదైనా చేయాలని ముందుకొచ్చారాయన. ‘రుద్రమదేవి’ని గట్టెక్కించడానికి మెగాస్టార్ చిరంజీవిని సాయం కోరుతూ బహిరంగ లేఖ రాశాడు.
‘‘గుణశేఖర్ మూడేళ్లు కష్టపడి.. ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి.. విడుదల విషయంలో ఎదురుదెబ్బల్ని తట్టుకుని.. ఎట్టకేలకు ఈ రోజు విడుదల చేశారు. రూ.70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పెట్టుబడి రాబట్టుకోవాలంటే కనీసం మూడు నాలుగు వారాలు బాక్సాఫీస్ దగ్గర ఖాళీ ఉండాలని, ‘బాహుబలి’ కోసం మహేష్ తన ‘శ్రీమంతుడు’ సినిమాను వాయిదా వేసినట్లే, ‘బ్రూస్ లీ’ని వాయిదా వేయాలని కోరారు. 
‘రుద్రమదేవి’లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ప్రత్యేక పాత్ర పోషించాడని, అంతే కాక స్వయంగా మీరు వాయిస్ ఓవర్ కూడా అందించారని గుర్తు చేస్తూ చిరంజీవిని ‘బ్రూస్ లీ’ వాయిదా కోసం వి జ్ఞప్తి చేశాడు. మరి ఈ నిర్మాత కోరికను చిరంజీవి మన్నిస్తారో లేదో వేచి చూద్దాం.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ