ఏం పాపం చేసిందని సన్నీని పొమ్మంటున్నారు?

September 07, 2015 | 12:18 PM | 6 Views
ప్రింట్ కామెంట్
sunny-leone-quit-india-jantar-mantar-niharonline.jpg

ఆమె వల్లే రేప్ లు జరుగుతున్నాయట. చిన్నవాళ్ల దగ్గరి నుంచి పెద్దోళ్ల దాకా అంతా చెడిపోతున్నారట. దేశాన్ని భ్రష్టుపట్టిస్తోంది.  పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ నటి గా ఎదిగిన సన్నీలియోన్ పై కొద్దిరోజుల క్రితం సీపీఐ నేత అతుల్ కుమార్ అంజన్  చేసిన తీవ్ర వ్యాఖ్యలు అవి. అందరికీ తెలిసిందే. ఆ వెంటనే రాజకీయ నేతల్లారా మీ పని మీరే చూసుకోండి, మా జీవితాల్లోకి తొంగిచూడకండీ అంటూ గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది. ఓ కండోమ్ యాడ్ లో ఆమె అభ్యంతరకరంగా(సెక్సీగా) నటించిందని, దాని వల్ల రేప్ లు జరుగుతాయని ఆయన ఉద్ధేశమయి ఉండొచ్చు. ఇక ఇప్పుడు తాజాగా ఆమెను వ్యతిరేకిస్తూ కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. సన్నీ లియోన్ దేశం విడిచి పోవాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొంతమంది ఆందోళన చేస్తున్నారు "దేశం విడిచిపో.. భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను కలుషితం చేయకు" అంటూ ధర్నా చేస్తున్నారు. అసలు సన్నీ అంతలా ఏం చేసిందని? నిజంగా ఆమె మన సంప్రదాయాలను దెబ్బతీస్తుందా?

                        నటన ముసుగులో చాలా మంది చాలా పనులకు పాల్పడుతున్నారు. పబ్లిసిటీ కోసం న్యూడ్ ఫోటోలు, వీడియోలంటూ అప్ లోడ్ చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ఇలా చీప్ ట్రిక్స్ పాల్పడే వారికంటే సన్నీ చాలా బెటర్. చాలా పంక్షన్లలో, ఇంటర్వ్యూలలో ఆమె అదే ఓపెన్ గా చెబుతూ వస్తుంది. కెనడాలో ఉన్న టైంలో తాను పోర్న్ సినిమాల్లో నటించానని, కానీ, భారతీయ వాతావరణంకి వచ్చాక మారిపోయాయని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు విలువలున్నాయని, ఇకపై తాను అవి పాటిస్తానని చెప్పుకొచ్చింది. గతం తలుచుకుంటే అసహ్యాం వేస్తుందని కూడా అంది. ప్రస్తుతానికి కూడా నటనలో భాగంగానే శృంగారాన్ని ఒలకబోస్తున్నానే తప్ప  తానేం తప్పేం చెయ్యట్లేదని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పింది. మరిఅంలాటప్పుడు ఆమెను ఆరిపోసుకోవటం ఎందుకు? ఆమె వల్ల నష్టపోతున్నవారు, ఆఫర్లు లేకుండా అయి పోయిన వారే దీని వెనుక ఉండొచ్చని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే తప్ప సన్నీ చేసేదాంట్లో తప్పేం లేదన్నది మాత్రం అక్షర సత్యం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ