‘బెంగాల్ టైగర్’కు కొబ్బరికాయ కొట్టారు

January 30, 2015 | 03:49 PM | 34 Views
ప్రింట్ కామెంట్

మాస్ మహరాజ రవితేజ సినిమాలు చూసి చాలా రోజులైనట్టుంది. బెంగాల్ టైగర్ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా ఇప్పటికి ముహూర్తం కుదిరింది. రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నాలు క‌ధానాయిక‌లుగా నటిస్తున్నారు. రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన‌ సంపత్ నంది దర్శకత్వంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంటోంది. ఈ చిత్రం ముహూర్తపు షాట్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో శుక్రవారం (జనవరి 30)తీశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, వివి వినాయక్, సురేంద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. హీరో హీరోయిన్లు, రవితేజలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. వివి వినాయక్ కెమెరా స్విచాన్ చేసారు. సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి చిత్రాలు నిర్మించిన కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ