మహేష్ తో ‘టపోరీ’ చేస్తాడట...

June 22, 2015 | 05:39 PM | 0 Views
ప్రింట్ కామెంట్
mahesh_puri_tapori_title_movie_after_brahmostav_niharonline

ఎప్పుడెప్పుడా అని పూరీ సినిమాలు అనుకునేంత లోపే మొదలు పెట్టడాలూ, ముగింపులు కూడా అయిపోతున్నాయి. గురువుగారు రాంగోపాల్ ను మించిన ఫాస్ట్ అయిపోయాడీ డైరెక్టర్. ఉంటుందా... లేదా అని జనాలు అనుకునే లోపే వరుణ్ తేజ్ సినిమా ప్లానింగ్స్ ప్రారంభమయ్యాయి. పూరీ చిరంజీవి సినిమా అయ్యేలోపు మహేష్ బాబు బ్రహ్మోత్సవం పూర్తి చేసుకొని రెడీ అయిపోతాడు. అప్పుడు మహేష్ బాబుతో పూరీ ‘టపోరీ’ సినిమా మొదలు పెట్టాలని నిర్ణయించేసుకున్నట్టు తెలుస్తోంది. ఇది చిరంజీవి సినిమాలో టపు టపు టపోరీ... పటలోని టైటిల్. ఈయన ఆలోచనలో ఉందంటే అది తప్పనిసరి గా ఉంటుందన్నది ఖాయం. పోకిరీని సొంత బేనర్లో తీశాడు పూరీ. బిజినెస్ మేన్ ఆర్ఆర్ మూవీ మేకర్స్ బేనర్... మరి టపోరీ సినిమా బండ్ల గణేష్ తో ఉంటుందని ఒక టాక్. మరి ఈ సినిమా ఎవరి చేతిలోకి వెళుతుందో... ఇటీవల మహేష్ సొంత బేనర్ కూడా మొదలు పెట్టాడు కాబట్టి ఆయనే సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మించుకున్నా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ