స్టార్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ నిర్మాతగా మారిపోయి లేడీ డైరెక్టర్ తో సినిమా చేసేస్తున్నాడట. ఈ స్టార్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నట్టనిపిస్తోంది. అలాంటి ప్రయోగాల్లో ఈ మధ్య వచ్చిన జ్యోతి లక్ష్మి ఒకటి. ఇప్పుడేమో నిర్మాతగా మారుతున్నట్టు సమాచారం. మన దక్షినాది తారల్లో వెరీ టాలెంటెడ్ నటి రేవతి. సినిమాల్లో ఆమె చేసే పాత్రలు ప్రత్యేకంగా ఉండడంతో పాటు తను దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. రెండిటికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఈమె ఇప్పుడు ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. నటిగా రేవతి తమిళం, తెలుగు, మళయాలం, హిందీ, కన్నడలో అనేక చిత్రాల్లో నటించారు. ఆమె ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించింది. అందులో 2002లో ఆమె చేసిన ఇంగ్లిస్ మూవీ 'Mitr, My Friend' సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ ఇంగ్లీష్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. తర్వాత ఆమె దర్శకత్వంలో హిందీలో 2004లో ‘ఫిర్ మిలేంగే', 2009లో మళయాలంలో ‘కేరళ కేఫ్', 2010లో హిందీలో ‘ముంబై కట్టింగ్' అనే చిత్రాలు వచ్చాయి. 2011లో ఆమె చేసిన మరో షార్ట్ ఫిల్మ్ ‘రెడ్ బిల్డింగ్ వేర్ ఈజ్ ది సన్ సెట్'కు జాతీయ అవార్డు వచ్చింది.
ఇప్పుడు పూరీ జగన్నాథ్ కు ఆమెతో కలిసి ఓ సినిమా నిర్మించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో? ఇప్పుడు పూరి దర్శకత్వం వహిస్తున్న ‘మా అమ్మ సీతామాలక్ష్మి’లో వీరిద్దరూ కలిసి ఈ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ కమర్షియల్ సినిమాల డైరెక్టర్ రేవతి సినిమా లన్నీ సామాజిక సమస్యలను బేస్ చేసినట్టుగా ఉంటాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా ఎలా ఉండబోతుందన్న టాపిక్ చాలా ఆసక్తిగా మారిపోయింది.