చిరంజీవి 150వ చిత్రం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అవుననీ, కాదనీ... న్యూస్ చాలానే సోషల్ నెట్వర్కుల్లో... మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తోంది. అఫీషియల్ గా పూరీ జగన్నాథే 150 వ చిత్రానికి డైరెక్టర్ అని ప్రకటించినప్పటికీ... లోలోపల ఏదో జరుగుతున్నట్టు చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రాన్ని ఆయనే చేస్తున్నట్లు రామ్ చరణ్ కూడా స్పష్టం చేసారు. చిరంజీవి అభిమాని అయిన తనకు ఆయన సినిమా డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆ మధ్య పూరి ట్వీట్ కూడా చేసారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుండి పూరి జగన్నాథ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ అభిమాని పూరిని ఈ విషయమై ప్రశ్నించగా చిరంజీవి సినిమా చేయడం లేదనే విషయం ఖరారు చేసారట. ట్విట్టర్లో ప్రైవేట్ మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయం అపీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలిసి మెగా అభిమానులు షాకవుతున్నారు. అసలు కారణమేంటో తెలియక అయోమయంలో పడ్డారు. పూరి జగన్నాథ్ ఇలా సడెన్ గా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు ఈ ప్రాజెక్టు వివి వినాయక్ చేతికి వెళ్లినట్లు, చిరంజీవి వి.వి.వినాయక్ తో సిట్టింగ్ వేసినట్టు... రైటర్ చిన్ని కృష్ణ చిరంజీవి కోసం స్టోరీ రాస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇటు గాలివార్తలు అనుకోవడానికీ లేక... నిజమే నని అనుకోలేక తర్జన బర్జనలు పడుతున్న ప్రేక్షకులకు ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వకపోతే ఈ సస్పెన్స్ వీడేలా లేదు.