పిలుపు కోసం జగన్ ఎదురు చూపులు

February 24, 2015 | 05:44 PM | 52 Views
ప్రింట్ కామెంట్
puri jagannath_niharonline

చిరంజీవి 150 వ సినిమా ఎన్నో రోజులుగా వార్తల్లో నలుగుతోంది. ఈ సినిమా కథ ఏమిటి? డైరెక్టర్ ఎవరు? లాంటి ప్రశ్నలపై ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు దర్శకుడు పూరీ జగన్నాద్ బాహాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఆయన 150వ సినిమా దర్శకత్వం వహించే అవకాశం తనకు వస్తే చాలా అదృష్టంగా, గౌరవంగా భావిస్తానన్నాడు. తాను చిన్నప్పటినుంచీ చిరంజీవికి వీరాభిమానినని చెప్పుకున్నాడు. థియేటర్ల ముందు ఫ్లెక్సీలు కూడా కట్టానని చెప్పారు. ఒక వేళ దర్శకత్వం వహించే అవకాశం గానీ వస్తే అభిమానులకు తెర పండుగ ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని చెప్పుకున్నాడు. ఈయన మాటల్ని బట్టి చిరంజీవి పిలుపుకోసం ఎదురు చూస్తున్నట్టే కనిపిస్తోంది కదా, మరి ఇంత అభిమానాన్ని చూపించే ఈ దర్శకుడి గురించి చిరంజీవి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నట్టు...? ఒకే అనెయ్యొచ్చు కదా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ