డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన 49 పుట్టిన రోజు పండుగను చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారట. ఇక్కడ సెలెబ్రిటీలకు విందు, ఫారిన్ మందు మామూలే కదా... మరి కాస్త ముందు కెళితే... అందమైన భామలతో బెల్లీ డాన్స్ కార్యక్రమం ఎరేంజ్ చేశారట. అయితే ఈ వీడియో క్లిప్ ఒకటి ఇంటర్నెట్లో లీకైంది. ఈ వీడియోలో ఇద్దరూ డాన్సర్లు బెల్లీ డాన్స్ చేస్తుండగా... వారి పక్కనే సిగరెట్ తాగుతూ, డ్రింక్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ కనిపిస్తున్నారు. ఇందులో ప్రత్యేకత కూడా ఏమీ లేదు. అది ప్రైవేట్ పార్టీ... అందులో రాం గోపాల్ వర్మ బుద్ధిగా కూర్చుని డాన్స్ చూస్తున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లకు ఇలాంటి మందు విందులు చాలా కామన్... దీన్ని న్యూస్ చేసి ఛానెల్ చూపించేటంతటి గొప్ప విషయం ఏమీ కాదు. కానీ న్యూస్ అయ్యింది అంతే... ఇదేదో ఎవరూ చేయనిపనీ, చూడని వింత అయినట్టు మీడియా ఇష్యూ చేయడం కూడా సబబు కాదేమో... !