జనగణమన ఎప్పుడో చెప్పలేం!

April 29, 2016 | 04:09 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Mahesh-Puri-Jana-Gana-Mana-Shooting-details-niharonline

ఓ హిట్ కాంబినేషన్ అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం చేసింది మహేష్ –పూరీ. పోకిరితో వీరిద్దరు చేసిన మ్యాజిక్ కు పదేళ్లు దాటింది.  చేసిన రెండు చిత్రాల్లో(పోకిరి, బిజినెస్ మాన్) ఎవరూ ఊహించని విధంగా ప్రిన్స్ ని మార్చి చూపించాడు పూరీ. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా కోసం అంతా ఎదురుచూస్తుండగా, ఏకంగా పోస్టర్ తో సహా రిలీజ్ చేసి సడన్ షాకిచ్చాడు పూరీ. జనగణమన అనే టైటిల్ తో తయారుచేసిన లోగోలో జాతీయ జెండాలో ఉన్న మహేష్ ఫోటో చూస్తే అభిమానులకు మతిపోవటం ఖాయం. అయితే బ్రహోత్సవం తర్వాత మురగదాస్ చిత్రానికి కమిట్ అయిన మహేష్ పూరీ తో ఎప్పుడు సినిమా చేస్తాడనేది అందరి డౌట్. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ సినిమాను అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు. అదే టైంలో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు హీరోగా ఓ కన్నడ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు పూరీ. అయితే పూరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు నెలల్లో సినిమాను చాపలా చుట్టేస్తాడు. ఎటోచ్చి మహేష్ ఫ్రీ అవ్వటానికి ఎంత లేదన్న ఏడాది పడుతుంది. సో సినిమా జనగణమన మొదలవ్వటం అనేది మహేష్ చేతుల్లోనే ఉందన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ