24 చిత్రం కోసం ఓవైపు కోలీవుడ్, మరోవైపు టాలీవుడ్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తానే నిర్మాతగా మారి నిర్మిస్తుండటం, ఇష్క్, మనం లాంటి చిత్రాల దర్శకుడు కావటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా అమెరికాలోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగు, తమిళ వెర్షన్లలో ఈ సినిమాను అక్కడ 267 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలో 'తెరి' సినిమాను పంపిణీ చేసిన 'సినీ గెలాక్సీ ఇంక్' సంస్థవారు, సూర్య సినిమాను కూడా పంపిణీ చేస్తున్నారు. విశేషం ఏంటంటే తనకంటే ఎక్కువ మార్కెట్ ఉన్న విజయ్ సినిమా కన్నా భారీ రేటుకు రైట్స్ ను అమ్మినట్లు తెలుస్తోంది. .మే 6న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఒక రోజు ముందు స్పెషల్ ప్రీమియర్ షోలను వేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఈ సినిమా టీమ్ చెబుతోంది. సైన్స్ ఫిక్షన్ గా టైమ్ మిషన్ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కడం సూర్య మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే.