శృతి గట్టెక్కేసింది...

April 20, 2015 | 05:26 PM | 60 Views
ప్రింట్ కామెంట్
Shruti_Hassan_case_with_draw_niharonline

హీరోయిన్ శృతి ఇప్పుడిక బయట పడిపోయిందట... ఇటీవల ఈ బ్యూటీపై దాఖలు చేసిన పిటిషన్ ని సిటీ సివిల్ కోర్టు కొట్టేసింది. ఈవిడ నాగార్జున, కార్తి మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు ఒప్పుకుని బిజీ డేట్స్ కారణంగా ఆ సినిమాలో చేయలేనంటూ నిర్మాతలకు ఈ మెయిల్ పంపింది.. దీంతో నొచ్చుకున్న నిర్మాతలు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు.. ఈ వివాదం ముగిసే వరకు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకూడదని ఉత్తర్వులిచ్చింది.. దీంతో శృతి ఇరకాటంలో పడింది.. ఇరు వర్గాల మధ్య ఏ రాజీ కుదిరిందో గాని తాజాగా పిక్చర్ మీడియా హౌస్ తన పిటిషన్ ను వెనక్కి తీసుకుంది.. దీంతో కొత్త సినిమాలు చేసేందుకు శృతికి లైన్ క్లియర్ అయింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ