మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో తెలుగు పరిశ్రమలో ఎవరైనా పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి తర్వాతే. నారాయణ మూర్తి మాటలు ఆవేశంగా ఉన్నా ఆలోచంపజేసేలా ఉంటాయి. తాజాగా ఆయన శ్రీధర్ సీపానను ఉద్దేశించి ఓ వైపు నవ్వుతూనే ఘాటుగా విమర్శలు చేశారు. ``ఏయ్ తమ్ముడూ... నువ్వు రాసే డైలాగుల్లో డబుల్ మీనింగ్ ఉందే. బూతు ఉందే. సెక్సుందే. అది తగ్గించే బాబూ నీ పుణ్యముంటుంది`` అని నేరుగా చెప్పేశారు. దానికి తోడు ఇప్పుడు వస్తున్న రచయితలు, దర్శకులు సినిమాల్లో బూతు అర్థాలను మానుకోవాలని, బూతు లేకుండా అందంగా, గుంభనంగా డైలాగులు రాయాలని కూడా చెప్పారు.