ఈ యువ హీరో తనను మహేష్ బాబు రికమండ్ చేయడంపై ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. శ్రీమంతుడు సినిమా కోసం ఒక యువ హీరోని తీసుకోవాలని అనుకుంటున్నారట. అప్పుడు 'అందాల రాక్షసి'లో చేసిన అబ్బాయిని తీసుకొందాం' అని రాహుల్ రవీంద్ర గురించి చెప్పాడట మహేస్. ఇది తెలిసిన రాహుల్ తన ఫీలింగ్స్ ని ఇలా బయట పెట్టాడు ‘‘మహష్ అడిగారు అన్న మాట వినగానే ఇంకేం ఆలోచించలేదు. మహేష్ సెట్లో ఎలా ఉంటాడో చూడ్డానికైనా ఈ సినిమా చేయాల్సిందే అనుకొన్నా'' అన్నారు రాహుల్ రవీంద్రన్. 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలరించాడు రాహుల్ రవీంద్రన్. 'అలా ఎలా'తో ఓ మంచి విజయాన్ని అందుకొన్నాడు. ఇప్పుడు 'టైగర్' లో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. 'శ్రీమంతుడు'లోనూ అతిథి పాత్ర పోషించాడు. రాహుల్ హైదరాబాద్లో మీడియాతో ముచ్చటించాడు. 'టైగర్' గురించి మాట్లాడుతూ... ''స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే పక్కా వాణిజ్య చిత్రం 'టైగర్'. ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి అనగానే ముక్కోణపు ప్రేమకథ అనుకొంటారు. అయితే మా మూడు పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది చాలా కీలకం అన్నారు. అలాగే సందీప్కిషన్లాంటి స్నేహితుడితో కలసి నటించడం ఓ మంచి అనుభూతి. 'టైగర్'ని తనే నా దగ్గరకు తీసుకొచ్చాడు. సినిమా బాగా వచ్చింది. 'అలా ఎలా' తరవాత చేస్తున్న సినిమా ఇది. కాబట్టి మరో విజయం సాధించాలన్న తపనతో చేశాము''అన్నారు.