ఘనంగా ‘సినిమా చూపిస్త మావ’ ఆడియో...

July 07, 2015 | 12:12 PM | 3 Views
ప్రింట్ కామెంట్
cinema_chupista_audio_niharonline

‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్‌తరుణ్‌-అవికాగోర్‌ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ ఆడియో వేడుక హైద్రాబాద్‌లోని శిల్ప కళావేదికలో నిర్వహించారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు బిగ్‌ సీడీని ఆవిష్కరించగా.. ఆడియో, మరియు ట్రైలర్ ను హీరో సునీల్‌ విడుద చేసారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌`ఆర్‌డిజి ప్రొడక్షన్స్‌ ప్రై.లి., సంయుక్తంగా. ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కల్కీమీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి ‘మేం వయసుకొచ్చాం’ ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. బోగాది అంజిరెడ్డి`బెక్కెం వేణుగోపాల్‌(గోపి)`రూపేష్‌ డి.గోహిల్‌`జి.సునీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్‌, బ్లెంకొండ సురేష్‌, కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌, జెమిని కిరణ్‌, ఆసూ నిహ్లాని, తుమ్మపల్లి రామసత్యనారాయణ, మలినేని లక్ష్మయ్యచౌదరి, డి.యస్‌.రావు, అమ్మిరాజు, రాజ్‌ కందుకూరి, రాజ్‌కుమార్‌.యం, మల్కాపురం శివకుమార్‌` ప్రముఖ దర్శకు ఎన్‌.శంకర్‌, శ్రీనువైట్ల, దశరధ్‌, ప్రవీణ్‌ సత్తారు, మధుర శ్రీధర్‌రెడ్డి, డార్లింగ్‌ స్వామి` ప్రముఖ రచయితలు కోన వెంకట్‌, గోపీ మోహన్‌, సాయికృష్ణ` యువ కథానాయకులు సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్ర. సిద్దు, సుధాకర్‌ కోమాకు, రాజారవీంద్ర` శ్రీమతి శ్యామలాకృష్ణంరాజు, పాకీ హెగ్డే, రీతువర్మ తదితరుతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యుందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. శేఖర్‌చంద్ర సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం పాటలు మధుర ఆడియో ద్వారా మార్కెట్‌లో లభ్యం కానున్నాయి. భాస్కరభట్ల రవికుమార్‌`వనమాలి`కృష్ణచైతన్య`ప్రసన్నకుమార్‌ సాహిత్యం సమకూర్చారు. అనసూయ యాంకరింగ్‌ చేసిన ఈ కార్యక్రమంలో కోమలి సిస్టర్స్‌ మరియు జబర్దస్ట్‌ బ్యాచ్‌ ప్రదర్శి:చిన కామెడి స్కిట్స్‌` సింహా, అనుదీప్‌, దిన్‌కర్‌, లిప్సిక తదితరులు ఆలపించిన పాటలు, చానల్‌ 10 డాన్స్‌ గ్రూప్‌ చేసిన డాన్సు ఆహుతులను ఉర్రూతలూగించాయి. ‘‘ఓ సినిమాలోని అన్ని పాటలు బాగుండడం చాలా అరుదుగా జరుగుతుంటుందని.. ‘సినిమా చూసిస్త మావ’ సినిమాలోని పాటలన్నీ సూపర్‌గా ఉన్నాయని’’ రెబల్‌స్టార్‌ కృష్టంరాజు, హీరో సునీల్‌, దర్శకుడు శ్రీనువైట్ల తదితర ఆతిధులంతా అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుడిగా శేఖర్‌చంద్రకు ఉజ్వమైన భవిష్యత్‌ ఉందన్నారు. బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని, సప్తగిరి, మేల్కొటే, జయలక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. సంభాషణలు: ప్రసన్న జె.కుమార్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌`దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి`బెక్కెం వేణుగోపాల్‌(గోపి)` రూపేష్‌ డి.గోహిల్‌``జి.సునీత, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ