రాజమౌళి అసంతృప్తి ఖరీదు 30 కోట్లు?

April 06, 2016 | 03:31 PM | 4 Views
ప్రింట్ కామెంట్
baahubali-part-2-rajamouli-reshoot-niharonline

దర్శకుడిగా రాజమౌళి ప్రతిభ ఏంటో తెలుగు ఇన్నాళ్లు తెలుగువారికి మాత్రమే బాగా తెలుసు. బాహుబలి మేనియా పుణ్యమాని యావత్ ప్రపంచం ఆయనలో ఉన్న విషయం ఏంటో తెలియజేసింది. మేకింగ్ వీడియోల్లో జక్కన్న పడ్డ కష్టం చూసి హాలీవుడ్ దర్శకులు సైతం ఔరా అనుకున్నారంటే అతిశయోక్తి కాదు. సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడటంతోపాటు, చిత్ర యూనిట్ కి చుక్కలు చూపించే పని రాక్షసుడు. అందుకే బాహుబలి సెన్సెషన్ క్రియేట్ చేసింది. అన్నట్లు నేడు బాహుబలి బ్రస్సెల్స్ లో ప్రత్యేక షో కూడా వేయనున్నారు. అయితే ఎన్నో గాసిప్స్ వినిపించినట్లే బాహుబలి గురించి ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది.

ప్రేక్షకులంతా రెండవభాగం ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో షూటింగ్ పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే పార్ట్ 2 కి సంబంధించి ఇంతవరకూ చిత్రీకరించిన సన్నివేశాలలో కొంత భాగం రాజమౌళికి పూర్తిస్థాయిలో సంతృప్తి కలిగించలేదట. దాంతో ఆయన ఆ సీన్స్ ను రీ షూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.

అంతేకాదు రీ షూట్ మూలంగా మరో 30 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని సమాచారం. అయినా సరే ఫర్ఫెక్షనిజం కోసం రీ షూట్ చేయవలసిందేనని దర్శకధీరుడు డిసైడ్ అయ్యాడంట. సాధారణంగా రాజమౌళి షూటింగ్ స్పాట్ లోనే సీన్ ఖచ్ఛితంగా వచ్చేదాకా చూసుకుంటాడు. అలాంటిది ఇప్పుడు అల్రెడీ షూటింగ్ అయిన పార్ట్ లో మార్పులు కొరుకుంటున్నాడంటే ఎంత ఒత్తిడిలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. రీ షూట్ చేసిన రిలీజ్ డేట్ లో మార్పు మాత్రం ఉండబోదని నిర్మాతలు ఖరాఖండిగా చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ