ఈగ యాంకరింగ్....

May 25, 2015 | 02:05 PM | 46 Views
ప్రింట్ కామెంట్
hero_nani_anchoring_niharonline

డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకుంటూ వరుస సినిమాలో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాని ప్రస్తుతం  భలే భలే మగాడివోయ్ సినిమాలో నటిస్తున్నాడు. అంతేనా.... హీరోగానే పరిమితం కాకుండా నిర్మాతగా కూడా మారాడు... ఇదే కాకుండా ఇటీవల ‘ఓకే బంగారం’ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి డబ్బింగ్ కూడా చెప్పాడు. తన టాలెంట్ ను ఇక్కడితో పరిమితం చేయకుండా యాంకరింగ్ అవతారం కూడా ఎత్తబోతున్నాడు. అది కూడా ప్రభాస్, రాజమౌళిల కాంబినేషన్ లో వస్తోన్న ’బాహుబలి’ సినిమా ఆడియో కోసం యాంకర్ అవుతున్నాడు. ఈ నెల 31న గ్రాండ్ లెవల్ లో జరిగే ఈ వేడుకకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి కన్ ఫర్మ్ చేశాడు. రాజమౌళిపై ఉన్న అభిమానంతో నాని ఈ యాంకరింగ్ చేస్తున్నాడట.  యాంకరింగ్ చేయడానికి అంగీకరించినందుకు నానికి థాంక్స్ కూడా చెప్పాడు రాజమౌళి...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ