ఎట్టకేలకు రాజేంద్రుడిదే విజయం

April 17, 2015 | 12:18 PM | 49 Views
ప్రింట్ కామెంట్
rajendra_prasad_maa_elections

ఎన్నాళ్ళుగానో వాయిదా పడుతూ వచ్చిన మా ఎలక్షన్ కోర్టు కేసు ఎట్టకేలకు తీర్పు రావడం, శుక్రవారం ఎన్నికల లెక్కింపు నిర్వహించడం జరిగిపోయాయి. ఎప్పుడూ లేని విధంగా ఉత్కంఠ కలిగించిన ఈ ఎన్నికలకు శుక్రవారం ముగింపు పలికినట్లయ్యింది. అధ్యక్ష పదవి నవ్వుల రారాజు రాజేంద్రుడిని వరించింది. జయసుధపై ఆయన ఘన విజయం సాధించారు. దీంతో రాజేంద్రప్రసాద్ కు మద్దతు పలికిన వారంతా పండగ చేసుకుంటున్నారు. గురువారం హైకోర్టు తీర్పుతో ఓట్ల లెక్కింపునకు మార్గం సులభమైంది. ఫిలిం ఛేంబర్‌లో ఓట్ల లెక్కింపు జరిగింది. కృష్ణ మోహన్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి రాజేంద్రప్రసాద్ జయసుపై 32 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే సమయానికి కూడా రాజేంద్రుడే ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ ముగిసే నాటికి రాజేంద్రప్రసాద్ 46 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇది న్యాయానికీ అన్యాయానికీ మధ్య జరిగిన పోరాటమని, న్యాయం గెలిచి తీరుతుందని శివాజీ రాజా ఓట్ల లెక్కింపుకు ముందు అన్నారు. తాను రాజేంద్ర ప్రసాద్ పక్కన ఉన్నానని కూడా అన్నారు. గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగింది. మొత్తం 394 మంది సభ్యులు మాత్రమే ఓటింగులో పాల్గొన్నారు. మొత్తం 702 మంది సభ్యులున్నారు. ఎన్నికలు సాధారణ ఎన్నికలను గుర్తుకు తెచ్చే విధంగా ఈసారి ఫిల్మ్ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా ఏర్పడి, పోటీ పోటీగా ఒకరి మీద ఒకరు విమర్శలు, విసుర్లు సంధించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. శుక్రవారం పలువురు సినీ ప్రముఖులు ఫిలిం ఛేంబర్‌కు చేరుకుని, రాజేంద్ర ప్రసాద్ వర్గానికి అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ