ప్రత్యక్ష రాజకీయాలను తలపించేలా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యవర్గ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి జయ సుధలు పోటీపడ్డారు. నాగబాబు వర్గం రాజేంద్ర ప్రసాద్ ను బలపరచగా, ప్రస్తుత మా అధ్యక్షుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మురళీ మోహన్ జయసుధను బలపరుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు మా ఎలక్షన్లలో ఇప్పటిదాకా కనీ విని ఎరగని రేంజ్ లో ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగి, రాజకీయాలను తలపించారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఎన్నికు అసలు సవ్యంగా జరగలేదని ఆరోపిస్తూ నటుడు ఓ.కళ్యాణ్ కోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు మాత్రం ఆయన వాదనను తోసిపుచ్చుతూ ఎన్నికల ఫలితాల మార్గం సుగమం చేసింది. దీంతో నేటి ఉదయం 10 నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 702 ఓట్లకు గానూ 394 ఓట్లు పోలయ్యాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో విజయం ఎవరిది అనేది కాసేపట్లో తేలనుంది.