తండ్రి కోసం కూతురి త్యాగం...

June 02, 2015 | 12:59 PM | 0 Views
ప్రింట్ కామెంట్
RajiniKanth_daughter_soundarya_niharonline

ఫ్యామిలీలో ఎక్కువంగా పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రులు కోసం పిల్లలు కొన్ని పనులు చేస్తుంటారు. వాటిలో కొన్ని బయట నుండి చూసేవారిని హత్తుకుంటూ ఉంటాయి. అది సాధారణ కుటుంబమైనా స్టార్స్ కుటుంబమైనా సరే. అలాంటి ఓ పనిని సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య తన తండ్రి కోసం చేసింది. ఏం చేసిందనే వివరాల్లోకెళ్తే..సౌందర్య ఈరోస్ నిర్మాణ సంస్థలో సౌత్ ఇండియా హెడ్ గా జాబ్ చేస్తున్న విషయం తెలిసిందే. తను పనిచేస్తున్న టైమ్ లోనే రజనీకాంత్ ఈరోస్ వారితో కొచ్చడయాన్ సినిమా కూడా చేశాడు. ప్రస్తుతం రజనీకాంత్ అట్టకత్తి, మద్రాస్ చిత్రాల దర్శకుడు రంజిత్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ సౌందర్య ఈరోస్ సంస్థలో తన జాబ్ ను వదులుకుంది. తన పిల్లలతో సమయాన్ని గడపడానికి, తన నెక్స్ ట్ మూవీని సిద్ధం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌందర్య సోషల్ మీడియాలో తెలియజేసింది. అయితే సౌందర్య రజనీకాంత్ నటించనున్న నెక్స్ ట్ మూవీకి లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేయడానికి తన జాబ్ ను వదులుకుందని ఫిలింవర్గాలు అంటున్నాయి. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ