ఫ్లాష్... కబాలి రిలీజ్ డేట్ ఫిక్స్

April 21, 2016 | 05:03 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kabali-release-date-fix-niharonline

ఈ యేడాది మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టుగా ఉన్న రజనీకాంత్‌ 'కబాలి' సినిమా విడుదల తేదీ ఖరారైంది. నిజానికి చిత్రం మే మొదటి వారంలోనే విడుదల కావాలి. అయితే సూపర్ స్టార్ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్(రోబో-2) బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యం అయ్యింది. ఇక కబాలిని జూన్‌ 3న విడుదల చేయాలని నిర్మాత కలైపులి ఎస్ థాను నిశ్చయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రఖ్యాత ప్రివ్యూ థియేటర్‌ లే మ్యాజిక్‌ లాంతర్న్‌లో సోమవారం నుంచి ఆయన 'కబాలి'కి డబ్బింగ్ చెప్తున్నారు. మే 1న ఒక నిమిషం నిడివి గల 'కబాలి' టీజర్‌ను విడుదల చేయనున్నారు.

                                       ఇక చిత్రం ఎక్కవ భాగం మలేషియాలో షూటింగ్ జరుపుకున్నందున ఆడియో అక్కడే రిలీజ్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారంట. కబాలిలో అండర్ వరల్డ్ డాన్ గా రజనీ నటిస్తుండగా, ఆయన సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా చేస్తుంది. ధన్సికా, కలైరాజన్‌, దినేశ్, నాజర్ తదితరులు మిగతా పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు ‘పా’ రంజీత్ పర్యవేక్షణలో స్పెషల్ ఎఫెక్ట్స్‌, ఎడిటింగ్‌ పనులు చకచకా జరిగిపోతున్నాయి' అని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ