తమిళ సూపర్ స్టార్ అభిమానులకు షాకింగ్ న్యూస్. రజనీకాంత్ ఆస్తుల వేలానికి ఎగ్జిమ్ బ్యాంకు పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చింది. రజనీ తమ బ్యాంకుకు రూ.22 కోట్లు చెల్లించాల్సి ఉన్నందునే ఈ ప్రకటన ఇచ్చినట్టు ఎగ్జిమ్ బ్యాంకు ప్రతినిధులు చెపుతున్నారు. కొచ్చడయాన్ చిత్ర సందర్భంగా మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 22 కోట్లు రుణంగా తీసుకుంది. వాయిదా దాటినా ఈ మొత్తం చెల్లించనందునే తాము ఆస్తుల వేలానికి చర్యలు తీసుకున్నట్టు వారు చెబుతున్నారు. మరోవైపు సౌతిండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేన్ తీసుకునే హీరో అయిన రజనీకాంత్ విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.