తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు కిక్ 2, రాంచరణ్ సినిమా షూటింగ్ లు అయిపోవడంతో డేట్స్ కాళీ అయిన కారణంగా బ్రహ్మోత్సవానికి తీసుకునే ఉద్దేశంలో ఉన్నారట. శ్రీమంతుడు అయిపోయిన నాటికి రకుల్ ప్రీత్ సింగ్ డేట్స్ కాళీ లేకపోవడం వల్ల మహేష్ తో నటించే ఛాన్స్ ను మిస్సయ్యానని రకుల్ ప్రీత్ సింగ్ తెగ బాధ పడిపోయింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈమెకు బ్రహ్మోత్సవంలో మళ్ళీ ఛాన్స్ ఇచ్చారట.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు ముందుగానే రకుల్ ను సూచించాడట. కథ ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. సమంత ప్రధాన నాయికగా ఎంపికైంది. అయితే ఈ చిత్రం నుంచి సమంతని తొలగించి ఆ ప్లేసులో రకూల్ ప్రీత్ సింగ్ ని ఓకే చేశారుట. అవసరమైతే రకూల్ కోసం ఆ మాత్రం వెయిట్ చేయడంలో తప్పేంలేదని మహేష్ అన్నారని తెలుస్తోంది. పివిపి సినిమాస్ పతాకంపై పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమంతుడు తర్వాత మహేష్ ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల నటీనటుల ఎంపికల్ని పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా నాయికల్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.