మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం' శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ లీడింగ్ హీరోయిన్గా ఎంపిక చేసినప్పటికీ ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. అయితే ఈ విషయమై రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా నోరు విప్పారు. ‘మహేష్ బాబు సినిమా కోసం నేను డేట్స్ ఇచ్చిన మాట వాస్తవమే. ప్రస్తుతం నేను చరణ్ మూవీతో బిజీగా ఉన్నాను, మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ మూవీ మొదలవుతుంది. వీటి తర్వాత నెల డేట్స్ ఇచ్చాను. కానీ బ్రహ్మోత్సవం టీం జులైలోనే డేట్స్ కావాలన్నారు. జులైలో నాకు ఇతర సినిమాల షూటింగ్స్ ఉన్నందున తప్పు కోక తప్పలేదు' అని తెలిపారు. అయితే ఈ సినిమాల తరువాత రకుల్ ప్రీత్ సింగ్ కొత్తగా అర్జున్-బోయపాటి సినిమాకు కూడా కమిట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.