రామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ తో వచ్చే ‘మై నేమ్ ఈజ్ రాజు’ (పరిశీలనలో ఉంది) సినిమా ఇంకా మొదలు పెట్టకముందే ఎన్ని మార్పులు చేర్పులో ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. బ్రహ్మీ లేడనీ, కథ ఓకే అవ్వలేదని, కథలో కోన వేళ్ళు పెడుతున్నాడనీ... ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు కొత్త గా ముందుగా అనుకున్న హీరోయిన్ సమంత తప్పించారంటూ వార్తలు. ఇంత వరకు సమంత రామ్ చరణ్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. మళ్ళీ ఆమెకు ఛాన్స్ మిస్సయ్యింది. ఆమెను తప్పించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తప్పించే అంత మాట వాడేకన్నా డేట్స్ కుదరకపోవచ్చునని కూడా కొందరనుకుంటున్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ కు చరణ్ తో రొమాన్స్ చేసే అవకాశం ఇచ్చారట. ముందు ఈ సినిమాకు శృతి హాసన్ ను తీసుకోవాలనుకున్నారట. ఆమె డేట్స్ కుదరకపోవడంతో సమంతను తీసుకున్నారు. అనుకున్న సమయానికి షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఆమె డేట్స్ ఇవ్వలేకపోయిందంటున్నారు. సమంతకు ఆ తరువాత కూడా డేట్స్ ప్రాబ్లం అయితే షూటింగ్ కు అంతరాయం కలుగుతుందని రకుల్ ను తీసుకున్నారట. అయితే సమంతకు ఇంతకు ముందు కూడా రామ్ చరణ్ తో నటించే అవకాశం ‘ఎవడు’ సినిమా ద్వారా వచ్చిందట. ఆ సినిమాకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఏదో రావడంతో అందులోనూ నటించలేకపోయింది. దాదాపు అందరు పెద్ద హీరోలతో నటించిన సమంతకు రామ్ చరణ్ తో ముహూర్తం కుదరడం లేదు పాపం.