‘హృదయకాలేయం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు ఇప్పుడు సింగర్ గా మారిపోతున్నాడట. హీరోకు ఉండాల్సిన క్వాలిటీ విషయాలు పక్కకు పెడితే మొదటి సినిమాతోనే ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడీ హీరో. సినిమాల మీద ఓ సెటైరిక్ థీమ్ తో వచ్చిన హృదయ కాలేయంలో నవ్వులు పండించాడు సంపూ. అయితే ఈయన రాబోయే సినిమాలో సింగర్‌గా కూడా మారనున్నాడు. ఆయన గళంతో ఆడియన్స్ కు వీనుల విందు చేస్తానంటున్నాడు. ప్రస్తుతం ఈయన ‘కొబ్బరి మట్ట’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా దర్శకుడు సంపూతో ఒక పాట పాడించాలని ఉబలాటపడుతున్నాడు. ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్, ఈ మధ్యనే మొదలు పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క సినిమాతోనే హీరోగా పాపులర్ అయిన సంపూ పాటతో కూడా పాపులర్ అవుతాడా లేదా వేచి చూద్దాం...