ఏ విషయాన్ని వదలకుండా ప్రతీదానిని గెలుక్కొని ట్వీట్ల్ రూపంలో పోస్ట్ చేస్తూ వివాదాస్పద మనిషిగా పేరొందాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. చిన్న, పెద్ద, మాములు అన్న తేడా లేకుండా ప్రతీ విషయాన్నీ తనదైన కోణంలోకి కన్వర్ట్ చేసి మరీ రాద్ధాంతం చేయడం ఆయనకు కామన్. అలాంటి వర్మ తొలిసారి ఓ విషయంలో మానవతవాదంతో స్పందించాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంతకీ వర్మ ఏమన్నాడంటే... ముంబై పేలుళ్ల సూత్రధారి యాకుబ్ మెమన్ ఉరి పై ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. "మెమన్ పై కొంతమంది జాలి చూపిస్తున్నారు. ఎందుకంటే అతను ఫొటోల్లో ఓ సామాన్యుడిగా కనిపిస్తున్నాడు. మనలాగే అతడూ చాలా సాదాసీదాగా కనిపిస్తున్నాడు. కానీ ఆ రోజు జరిగిన పేలుళ్ల ఘటనలో ఎంతోమంది చనిపోయారు. 257 మంది అనేది ఓ నంబర్ లాగే కనిపించడం వల్ల కొంతమందికి జాలి కలుగుతుందేమో అని తనదైన శైలిలో వెటకారంగా మాట్లాడాడు. ఊరందరిది ఓ దారి అయితే ఉలికి పిట్టది ఓ దారి అన్నట్లు... ఎప్పుడూ భిన్నంగా స్పందించే వర్మ ఈ విషయంలో పాజిటివ్ గా స్పందిచడం నిజంగా గ్రేట్.!