క్రిమినల్ లాయర్ గా రాంశంకర్

June 06, 2015 | 12:43 PM | 0 Views
ప్రింట్ కామెంట్
nenu_ vadu_kadu_shooting_niharonline

ఇప్పటి వరకు ఓ ప్రేమికుడుగా, రోమియోగా, పోకిరీ అబ్బాయిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఇప్పుడు'వాడు నేను కాదు' చిత్రంలో క్రిమినల్ లాయర్ గా నటిస్తున్నాడు. ఈ హీరో అందరికీ తెలిసిన పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్. తన లక్కు మారుతుందేమో నని ఇప్పుడు ఈ హీరో తన పేరును రామ్ శంకర్ గా మార్చుకున్నాడు. అయితే ‘వాడు నేను కాదు’ అనే చిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నికి వినోద్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ క్రిమినల్ లాయర్ బిగ్ పజిల్ ను ఎలా ఛేదించాడు అనేది ఈ చిత్రం ద్వారా చూడవచ్చని చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్ లో తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, భోజ్‑పూరి భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సాయిరాం శంకర్‑కి దర్శకుడు విజయన్‑కు మధ్య గత కొద్ది సంవత్సరాలుగా ఈ చిత్ర కథపై జరిగాయని... అయితే అవి ఇటీవల కొలిక్కి రావడంతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైందని వివరించింది. నటి మహిమ నంబియార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పింది. అలాగే మరో నటిని ఎంపిక చేయవలసి ఉందని... అందుకోసం ఇప్పటికే చిత్ర దర్శకుడు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారని పేర్కొంది. వివిధ చిత్రాలకు పని చేసి పలు అవార్డులు అందుకున్న ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో సాయిరాం ద్విపాత్రాభినయం చేయనున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ