ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించారు. రామానాయుడు స్టుడియోలో నిర్వహించిన ఆయన అంతిమ సంస్కార యాత్రలో వేలాది అభిమానులు పాల్గొని ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రామానాయుడి చితికి ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు నిప్పంటించారు. రామానాయుడి పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో స్టూడియోకి తీసుకు వచ్చిన అనంతరం అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకూ స్టుడియోలోనే ఉంచారు. మూవీ మొగల్ ను కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో రామానాయుడి స్టుడియో అంతా జనసంద్రంగా మారింది. రామానాయుడి మృతితో సినీ పరిశ్రమ కన్నీటి సంద్రమైంది