సినిమా విడుదలకు పక్కా ప్లానింగ్ ఉండాలి

October 12, 2015 | 12:24 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Ram-Charan-Teja-about-rudramadevi-niharonline

గుణ శేఖర్ రుద్రమదేవి, రాంచరణ్ బ్రూస్ లీ సినిమాలకు గ్యాప్ ఎక్కువ లేకపోవడం వల్ల రుద్రమదేవికి కలెక్షన్ల విషయంలో నష్టం జరుగుతుందన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే నిర్మాత తుమ్మల పల్లి రామ సత్యనారాయణ బహిరంగ లేఖ ఒకటి చిరంజీవిని ఉద్దేశించి రాశారు. దీనికి చిరంజీవి నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ రాంచరణ్ మాత్రం క్లారిటీ ఇచ్చారు.  ‘‘తాను రూల్స్ ని బ్రేక్ చేయనని.... బాహుబలి, శ్రీమంతుడు,కిక్ 2 నిర్మాతల మధ్య క్లియర్ గా అండర్ స్టాండిగ్ కుదిరిందని, అందుకే రెండు వారాల చొప్పున గ్యాప్ అండర్ స్టాండింగ్ లో తీసుకున్నారు. అలాంటిదే రుద్రమదేవికి, బ్రూస్ లీ కి మధ్య అండర్ స్టాండింగ్ జరిగి ఉంటే బాగుండేది. నేను ఈ విషయమై బన్నీతో కూడా ప్రస్దావించాను. దురదృష్టవశాత్తు అలాంటి అండర్ స్టాండింగ్ ఏదీ జరగలేదు. అయితే ఈ హడావిడి మా ఇద్దరిలో ఎవరికీ ఎఫెక్టు కాదనే భావిస్తున్నాను. నెక్ట్స్ టైమ్ నుంచి రెండు వారాల గ్యాప్ చూసుకునే సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటాము. ఆగడు టైమ్ లో కూడా మా గోవిందుడు అందరి వాడేలా చిత్రాన్ని వారి రిక్వెస్ట్ మేరకు రెండు వారాలు ముందుకు వెళ్లాం" అని వివరించారు. ‘‘బాహుబలి రిలీజ్ సమయంలో స్వయంగా శోభు యార్లగడ్డతో పాటు రాజమౌళి కూడా శ్రీమంతుడు హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివతో మాట్లాడారు. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ అయితే నష్టాలు తప్పవని, అది రెండు సినిమాలకు మంచిది కాదని వివరించారు. కానీ ఇప్పుడు రుద్రమదేవి విషయంలో తన దగ్గరికి కానీ, నిర్మాత దానయ్య దగ్గరకు కానీ ఏ నిర్మాతా రాలేదు. తమ సినిమా వాయిదా వేయమని కోరలేదు. ఒకవేళ గుణశేఖర్ టీం వచ్చి అడిగితే వాయిదా విషయమై ఆలోచించేవాళ్లం. అంతేకాకుండా తమ బ్రూస్ లీ చిత్రం రిలీజ్ డేట్ ఖరారు చేసిన తర్వాతే అక్టోబర్ 9న రుద్రమదేవి, అఖిల్ చిత్రం 22 కు విడుదల తేదీలు పెట్టుకున్నారు. మేము అనౌన్స్ చేసిన తరువాతే వాళ్ళు డేట్లు అనౌన్స్ చేశారు’’ అన్నాడు రాంచరణ్. ఈ విషయంలో తమ తప్పులేదన్నట్టు నిర్మాత, డైరెక్టర్లకు విడుదల విషయాల్లో క్లారిటీ ఉండాలన్నట్టు మాట్లాడాడు రాంచరణ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ