శనివారం రాత్రి అంటే ఆదివారం తెల్లవారుజామున రామ్ చరణ్ తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ పెద్ద ఎత్తున రికార్డు సౌండ్స్ తో పక్కవారికి ఇబ్బంది కలిగించి, రచ్చ రచ్చ చేశాడు. ఇది కంప్లయింట్ ఇచ్చేవరకూ దారి తీసింది. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక వార్తను ప్రచురించింది. తెలుగు పత్రికలో ఈవార్త రావడం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే చిరంజీవి ఇంటి నుండి సంగీత ధ్వనులు తమకు అసౌకర్యం కలిగిస్తున్నాయంటూ కంప్లయింట్ చేశారట. ఈ అసౌకర్యానికి ఒక పోలీసు ఉన్నతాధికారి ఈ విషయమై తన విభాగానికి తెలియచేయడంతో కొంతమంది పోలీసులు ఆ సంగీత హోరును తగ్గించమంటూ చిరంజీవి ఇంటికి చేరుకున్నారని ఆ పత్రిక కథనం. ఈ విషయమై పోలీస్ ఆఫీసర్ ఇంటివద్దకు వెళ్ళినట్టు, రామ్ చరణ్ అతనితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో రాంచరణ్ తో పాటు రాజకీయ నాయకుల కుమారులు కొందరు ఉన్నట్టు తెలుస్తోంది. విషయం ఏ మేరకు వెళ్ళింది తెలియదు కానీ, రాంచరణ్ పై రకరకాలుగా చర్చించుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఆమధ్య సాఫ్ట్ ఇంజనీర్ పై చేయిచేసుకోవడం వరకూ వెళ్ళి సెన్సేషన్ క్రియేట్ చేసిన చరణ్, ఇప్పుడు మళ్ళీ లేట్ నైట్ పార్టీ గొడవలో వార్తలకెక్కాడు.