రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ పేజీలో ఈసారి చాలా ఎక్కువగా స్పందించారు. ‘‘కలాంజీ వంటి గొప్ప వ్యక్తులకు మరణం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు’’ అని ట్వీట్ చేశాడు ఆయన ఒక ట్వీట్ తో ముగించకుండా... అంతకుముందు ‘‘కలాంజీకి రిప్ అని మెసేజ్ లు పెట్టకుండా ట్విట్టర్ జనాలు సెలబ్రెటీలు ఆయన గురించి ఇంత కేరింగ్ గా మాట్లాడుతుండటం నాకు చాలా థ్రిల్లింగ్ గా చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఎవరైనా చనిపోయినపుడే వారి విలువ బాగా తెలుస్తుంది. చనిపోయిన వారికి కూడా తనను జనాలు ఎంతగా ప్రేమిస్తారో.. చనిపోయాకే తెలుస్తుంది’’ అని వ్యాఖ్యానించాడు వర్మ. కలాం మృతి తనను కూడా చాలా బాధించిందని.. ఆయన మరణాన్ని ఇండియాకు తీరని లోటని ఇప్పుడు భారత్ ఆయన లోటును ఎలా తట్టుకుని ముందుకు వెళ్తుందో తెలియట్లేదని వర్మ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.