రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం జోరుమీదున్నాడు. ఓ సినిమా షూటింగ్ అలా పూర్తయ్యీ కాగానే, మరో సినిమా షూటింగ్‌ను మొదలుపెడుతున్నారు. అటాక్ సినిమా షూటింగ్ అలా ముగిసిందో లేదో ఇప్పుడు కిల్లింగ్ వీరప్పన్‌ను మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ కి సంబంధించిన కథ ఇది. ఈ సినిమాలో వీరప్పన్ని చంపిన పోలీసుగా శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. పరుల్ యాదవ్, యజ్ఞశెట్టి నాయికలుగా నటిస్తున్నారు. ఇంతకు ముందు అనంతపురం ఫ్యాక్షనిజం నేపథ్యంలో సినిమా తీసి అందరి దృష్టిని ఆకర్షించిన వర్మ ఈ సినిమాను కూడా అదే స్థాయిలో తీస్తారన్న నమ్మకాన్ని ఫిల్మ్ నగర్ వర్గాలు వెలిబుచ్చుతున్నాయి.