రానా చెప్పిన బాహుబలి స్టోరీ లైన్...

June 19, 2015 | 02:27 PM | 1 Views
ప్రింట్ కామెంట్
rana_bahubali_story_niharonline

ఒక విధంగా చెప్పాలంటే బాహుబలి సినిమాకు ఖర్చులేని ప్రచారం చాలా ఎక్కువగానే జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన కామెంట్లతో మరింతగా ప్రచారం అవుతోంది. గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా స్టోరీ అంటూ సోషల్ నట్ వర్క్లో ఓ స్టోరీ చక్కర్లు కొట్టింది. ఇది టీజర్ చూసిన వారు ఊహించి రాసినదే అయినప్పటికీ స్టోరీకి కాస్త దగ్గరగానే వచ్చినట్టు కనిపిస్తోంది.

మహిష్మతి రాజ్యనికి అధిపతి అయిన అమరేంద్ర బాహుబలి(ప్రభాస్) ఆయన భార్య దేవసేన(అనుష్క). వీరి పాలనలో ప్రజలు సుఖశాంతులతో కాలం గడుపుతూ ఉంటారు. అయితే స్వార్ద పరుడైన మంత్రి బిజ్జలదేవ(నాజర్) బాహుబలి సోదరుడు భల్లలదేవ(రానా)తో చేతులు కలిపి అమరేంద్ర బాహుబలిని యుద్దంలో చంపి రాజ్యాన్ని తమ ఆధీననంలోకి తెచ్చుకుంటారు. రాజ్యం తమ అధీనంలోకి వచ్చినాక తన విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటాడు భల్లలదేవ. అంతే కాదు ప్రజలను తన బానిసలుగా చూస్తాడు.

పసివాడైన బాహుబలి కుమారుడుని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు భల్లలదేవ. అయితే దేవసేన తన కుమారుడిని కాపాడి రాజ్యం దాటిస్తుంది. అయితే భల్లలదేవ సైన్యం దేవసేనను బందించి చెరసాల పాలు చేస్తారు. ఈ నేపద్యంలో చిన్న బాహుబలిని కొందరు గ్రామస్తులు కాపాడతారు. అంతేకాకుండా పెంచి పెద్దచేసి అతనికి శివుడు(ప్రభాస్) అని పేరు పెడతారు. శివుడు కూడా తన తండ్రి పోలికలతొనే ఉంటూ అందర్ని తన ధైర్య సాహసాలతో ఆకర్షిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో తన ప్రాంతానికి రాజకుమారి అవంతిక(తమన్నా) వస్తుంది. ఆమె అందం చందం చూసి శివుడు తనని ప్రేమిస్తాడు. అయితే ఆ తర్వాత అవంతిక తన రాజ్యానికి వెళ్లిపోతుంది. అవంతికను వెతుక్కుంటూ శివుడు మహిష్మతి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ శివుడు తన గతం గురించి తెలుసుకుంటాడు. క్రూరుడైన భల్లలదేవ పై ప్రతీకారం తీర్చుకొని రాజ్యాన్ని, ప్రజలను, తన తల్లిని ఎలా సొంతం చేసుకొన్నాడు అనేదే "బాహుబలి" చిత్ర కధ. అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

ఇదంతా చాలా రోజుల నుంచి నడుస్తున్న కథ అయినప్పటికీ.. ఈ కథకు కాస్త బలాన్నిచ్చే విధంగా రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేసాడు. బాలీవుడ్ లో ‘బాహుబలి’ ప్రమోషన్ పాల్గొన్న రానా.. అక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బాహుబలి’ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి సినిమా అని చెప్పుకొచ్చాడు. నిజానికి ట్రైలర్ లో చూస్తుంటే ‘బాహుబలి’ కూడా చనిపోయినట్లుగా అనిపించడం లేదు. బాహుబలి, దేవసేనలను చివరకు శివుడు చెరసాల నుంచి కాపాడుకుంటాడేమో అని అనిపిస్తుంది. ఒకవేళ రానా చెప్పినట్లుగా ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ అయితే... బాహుబలికి భల్లలదేవా తమ్ముడు అవుతాడు. అంటే శివుడు చిన్నాన్న అవుతాడు. కానీ తమన్న భల్లాల దేవ కూతురయితే మాత్రం చిన్న ప్రభాస్ కు వరస కుదరదు. మరి ఆవిడ ఎవరు? మహిష్మతి రాజ్యానికీ ఆమెకూ ఉన్న సంబంధం ఏమిటి? రమ్యకృష్ణ భల్లాలదేవకు తల్లి అయితే... ఆవిడ ప్రభాస్ కు మారుటి తల్లి కావచ్చా? అబ్బ.... ప్రతి వాళ్ళూ ఇంతలా ఆలోచించాలా ఈ సినిమా గురించి...?... జులై 10న హాయిగా థియేటర్లో చూస్తే పోతుంది కదా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ