రామానాయుడిని గుర్తు చేసుకున్న రామానాయుడు

June 06, 2015 | 05:08 PM | 0 Views
ప్రింట్ కామెంట్
rana_about_ramanaidu_niharonline

తన తాతయ్య రామానాయుడు చనిపోయినప్పుడు రానా (రానా అసలు పేరు కూడా రామానాయుడే) బాధపడిన తీరు చూస్తే... వీరిద్దరి అనుబంధం ఏమిటో ఎవరికైనా ఇట్టే తెలిసి పోతుంది. కాస్త రఫ్ గా కనిపిస్తున్నట్టుండే రానాలో ఇంత భావోద్వేగం ఉందా అనిపిస్తుంది. గత ఏడాది నాయుడుగారు స్వర్గస్తులైన నాటి నుంచి ఈ మనుమడు ఆయన జ్నాపకాలతోనే రోజులు గడిపేస్తున్నానంటున్నాడు. నాటి నుంచి నేటి వరకూ ఫ్యామిలీలో ఏ విషయం మాట్లాడుకున్నా తాతయ్య మెమరీస్ రాకుండా ఉండవంటున్నాడు. ఈ రోజుతో నాయుడుగారు 79వ సంవత్సరంలో అడుగుపెడతారని అన్నారు. తన చిన్న నాటి జ్నాపకలను గుర్తు చేసుకుంటూ ‘తాత నేను కొత్త కార్లో లాంగ్ జర్నీ చేసేవాళ్ళం. సొంతూరు కారం చేడు నుంచి హైదరాబాద్ కి ఆ కార్ లోనే వచ్చేవాళ్ళం. అయితే అప్పటికి హైదరాబాద్ రూపు రేఖలు వేరు. ఇంతగా అభివృద్ధి చెందక పోయినా జనం బాగానే ఉండేవారు. ఎప్పుడూ పవర్ కట్స్...‘ అంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ‘ఇప్పుడు ఆయన మమ్మలిన వీడి వెళ్ళాక... ఆయన గదిలోకి వెళ్లినా, ఆఫీసుకు వెళ్ళినా, ఆయన కార్లోకి ప్రవేశించినా తను నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కాసేపటికి అక్కడ శూన్యం ఒక్కటే దర్శనమిస్తుంది.... ఆ జ్నాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను..’ అని గుర్తు చేసుకున్నాడు రానా. ‘తాత అన్నిటినీ మించి క్రమశిక్షణ నేర్పాడు. ఉదయమే 9 గంటలకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఒంటిగంటకు లంచ్ కి రావాలి. తిరిగి 4 గంటలకు బైటికి వెళ్లిపోవాలి. తిరిగి మళ్ళీ 8కి చేరుకోవాలి. ఇలా రోజంతా టైమ్ టేబుల్ సెట్ చేసుకుని జీవించేవారాయన. ఇవన్నీ ఆయన నుంచి నేర్చుకున్న లైఫ్ లెసన్స్’ అని చెప్పు కున్నారు తాత పుట్టిన రోజున ఆయన జ్నాపకాల్ని గుర్తు చేసుకుంటూ.    

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ