సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమాలో రానా ను హీరోగా ఎంపిక చేసిన విషయం ఇంతకుముందే ఓ వార్త వెలువడింది. 1971 లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ లో పాకిస్తాన్ వాళ్ళు విశాఖపట్నంలోని పిఎన్ఎస్ ఘజి సబ్ మెరైన్ పై దాడి చేసి అది సముద్రంలో మునిగిపోయేలా చేసారు. ఇది మిస్టరీగా మిగిలిపోయిన కథ. దీన్ని సంకల్ప్ అనే రైటర్ స్క్రీన్ మీద చూపించేందుకు స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఈ సినిమా దర్శకుడు కూడా అతనే నట. బ్లూ ఫిష్ అనే బుక్ ఆధారంగా ఈ కథను రాసుకొచ్చాడు. ఈ సినిమాలో రానా నావికా అధికారిగా కనిపించనున్నాడు.
ఈ ప్రాజెక్ట్ ను పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం పివిపి వారు ఈ సినిమా కోసం ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో రానాకి జోడీగా సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ సమంతని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సంకల్ప్ సమంతతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటె పివిపి బ్యానర్ లో తమిళంలో తెరకెక్కిన బనగాలోరే డేస్ రీమేక్ లో ఓ పార్ట్ లో రానా – సమంత జోడీగా కనిపించనున్నారు. అక్కడ వారి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం వలన ఈ సినిమాలో కూడా వారిద్దరినే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘ఘజి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.