భళ్లాలదేవుడికి పెళ్లి భయం పట్టుకుంది

February 09, 2016 | 03:40 PM | 3 Views
ప్రింట్ కామెంట్
rana_daggubati_about_marriage_niharonline

 ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటుడిగా తానేమిటనేది రానా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'బాహుబలి' లో విలన్ గా కనిపించాడు. ఆపై రేంజ్ అమాంతం పెరగటంతో ఆ బిజీ షెడ్యూల్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. అలాంటి 31ఏళ్ల ఈ నటుడు పెళ్లి వరకు వచ్చేసరికి దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు.

                               వరుసగా సినిమాలకి సైన్ చేసిన ఆయన, వాటిని పూర్తిచేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆయన 'బెంగుళూర్ నాటక్కల్' సినిమా ఇంటర్వ్యూలో సరదా విషయాలు పంచుకున్నాడు. బాహుబలి 2 లో విలన్ గా తాను మరింత క్రూరంగా కనిపిస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఆయనని పెళ్లి గురించి అడగగా, ప్రస్తుతం తాను చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తయిన తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పాడు. అయితే తాను చేస్తోన్న విలన్ పాత్రలు చూసి తనని ఏ అమ్మాయి ఇష్టపడదేమోననీ, పెళ్లిచేసుకోవడానికి ఎవరూ ముందుకు రారేమోనని సరదాగా నవ్వేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ జాబితాలో ఉన్న ప్రభాస్ ఈయేడాది పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైపోతున్నాడు. రానా విషయంలో చొరవ చూపాల్సింది నాన్న సురేష్, బాబాయ్ వెంకీలే మరి!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ