సినీ ఇండస్ట్రీలో ఎక్కడ, ఎప్పుడు, ఎవరి మధ్య ఎలాంటి గాసిప్స్ పుట్టుకొస్తాయో ఎవరూ చెప్పలేరు. సినీ పెద్దలు, హీరోల మధ్య గొడవల దగ్గరి నుంచి ఫలానా హీరోహీరోయిన్ల మధ్య సమ్ థింగ్ నడుస్తుందని మన మీడియాలు ఊదరగొట్టేస్తుంటాయి. తాజాగా మంచి మిత్రులైన మహేష్ త్రివిక్రమ్ లు శత్రువులుగా మారిపోయారని, ఒకరంటే ఒకరికి పడటం లేదని వార్తలు ఓ మీడియా చానెల్ లో హల్ చల్ చేశాయి.
దానికి వారు చెప్పే రీజన్ వీరిద్దరి అప్ కమింగ్ ప్రాజెక్టులని, మహేష్ త్రివిక్రమ్ లిద్దరూ ఖలేజా తర్వాత సినిమా చేయలేదు. ఆ మధ్య ఓ ప్రాజెక్టు అనకున్నప్పటికీ ఇద్దరి వారి వారి బిజీ షెడ్యూల్ తో కలిసి పనిచేయలేకపోయారు. మేము సైతం లో సమంత ఇంటర్వ్యూనే వీరికి లాస్ట్ మీట్. దీనిని సాకుగా చేసుకుని ఓ కొత్త గాసిప్ కు తెరలేపారు. మహేష్‌తో అంత సాన్నిహిత్యం, స్నేహం వున్న త్రివిక్రమ్ 'బ్రహ్మోత్సవం ' రిలీజ్ లెక్క చేయకుండా 'అ ఆ' డేట్ అనౌన్స్ చేయడంతో ఇద్దరి మధ్య చెడిందని పుకార్లు బయల్దేరాయి.
అయితే బ్రహ్మోత్సవం ఏప్రిల్ 29న రావడం ఖాయమైతే, 'అ.. ఆ...'ని ఓ రెండు వారాలు వాయిదా వేస్తారట. పెద్ద సినిమాలకి రిలీజ్ డేట్లు మారుతూ వుంటాయి కామన్ కాబట్టి అలాంటిదేమన్న జరిగితేనే అ..ఆ...ని రీలీజ్ చేస్తారు తప్ప మహేష్ కి పోటీగా రిలీజ్ చేసే ఉద్దేశం లేదని త్రివిక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు. ముచ్చటగా వీరి కాంబినేషన్లో మూడో చిత్రం కోసం ఎదురుచూస్తున్న టైంలో ఎక్కడా లేని పుకార్లు లేపటం సరికాదు కదా.