బాహుబలి సినిమా తరువాత భళ్లాలదేవుడికి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రానాతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎగబడిపోతున్నారు. సబ్ మెరెన్ నేపథ్యంలో ఓ సినిమాతో ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోతున్నాడని తెలుస్తోంది. అయితే కుప్పలు కుప్పలు కథలు వచ్చిపడుతున్నప్పటికీ తొందరపడకుండా తనకి నచ్చిన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా తాజాగా ఆయన ఒక భారీ మల్టీ స్టారర్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
తమిళ్లో నిర్మించబడుతోన్న ఈ సినిమాలో విశాల్ .. ఆర్య .. అధర్వ .. అరవింద్ స్వామి ప్రధాన పాత్రలకు ఎంపిక అయ్యారు. మరో ప్రధానమైన పాత్రకి గాను ఈ సినిమా దర్శక నిర్మాతలు రానాను సంప్రదించడంతో, ఆయన ఓకే చెప్పాడట. ఈ సినిమాకి 'బాల' దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఆయన చేసిన శివపుత్రుడు .. వాడు - వీడు .. నేను దేవుణ్ణి వంటి సినిమాలు వైవిధ్య భరితమైనవని అనిపించుకున్నాయి. అవి ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. మరి, ఈ భారీ మల్టీ స్టారర్ తో ప్రేక్షకులకు బాలా ఎలాంటి ట్రీట్ అందిస్తాడో.