ఏ హీరోయిన్ కైనా ఒకానోక సమయంలో 'టైం బ్యాడ్' నడుస్తుంటుంది. టాలీవుడ్ లో మొదట్లో గోల్డెన్ లెగ్ గా పేరొందిన సమంతకి ఈ మధ్య వస్తున్న వరుస ఫ్లాప్ లతో ఐరన్ లెగ్ మార్క్ పడుతోంది. ఇక క్రేజ్ కూడా క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో వచ్చిన ఆఫర్లు కూడా వచ్చినవి వచ్చినట్లే చేజారుతున్నాయి. దీంతో క్రమంగా కోలీవుడ్ వైపు మళ్లీపోతుందనే వార్తలు వినవస్తున్నాయి. సూర్యతో ఆంజాన్ ఫ్లాప్ అయినప్పటకీ విజయ్ కత్తి బ్లాక్ బస్టర్ కావటంతో మెల్లిగా తమిళ్ లో చాపకింద నీరులా దూసుకెళ్తోంది. అయితే అదే సమయంలో తెలుగు అవకాశాలను కూడా ఆచితూచీ ఎంచుకుంటోంది. ఇక ఇప్పుడు నితిన్ తో నటించేందుకు ఓకే చెప్పిందట. ఇందుకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అయితే రామ్ చరణ్-వైట్ల సినిమాలా ఈ అవకాశం కోల్పోవద్దునుకుందో ఏమో ఈ మధ్య నితిన్ ట్వీట్ లకు తెగ రెస్పాన్స్ ఇస్తుంది. అంతేకాదు అఖిల్-వి.వి.వినాయక్ కాంబోలో రాబోతున్న చిత్రానికి నితిన్ నే నిర్మాత. దీంతో ఈ చిత్రానికి నితిన్ కి ఆల్ ది బెస్ట్ అంటూ, నితిన్ ఈ చిత్రంతో పెద్ద నిర్మాతగా పెద్ద హిట్ అందుకోవాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొంది. ఈ రకంగా ఐన వచ్చిన ఛాన్స్ మిస్ కాకుడదని ప్రయత్నాలు చేస్తున్నటుంది ఈ కుందనపు బోమ్మ.