రణ్‌వీర్‌సింగ్, దీపిక పదుకొనెల లవ్ ఎఫైర్ గురించి అందరికీ తెలిసిందే... కానీ పెళ్ళి గురించి గానీ, తమ ప్రేమను గురించి గానీ ఎప్పుడూ బాహాటంగా మాట్లాడరు. ఎవరైనా అడిగినా... ‘అబ్బే... అలాంటిదేమీ లేదు’ అని ఈ జంట అంటూనే ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళ ప్రేమ ఫలించబోతోందట... త్వరలో వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటున్నారనే టాక్ వినపడుతోంది. ఇద్దరూ తమ కుటుంబ పెద్దల నుంచి పెళ్లికి అనుమతి తీసుకున్నారట. దీపిక తల్లిదండ్రులకు రణ్‌వీర్ చాలా నచ్చాడని కూడా టాక్. దీపిక కుటుంబ సభ్యులను రణ్‌వీర్‌సింగ్ కలుసుకున్న ఫోటోలు కొన్ని నెట్‌లో షికారు చేస్తున్నాయి. దీపిక వాళ్ల ఇంట్లో జరిగే బర్త్ డే పార్టీలలో రణ్‌వీర్ ఉత్సాహంగా పాల్గొంటున్నాడనీ, అంతే కాదు ఈ మధ్య ఇద్దరూ కలిసి తెగ షాపింగ్ చేస్తున్నారని కూడా అనుకుంటున్నారు. అంతే కాదు, ఫిబ్రవరి 2016లో రణ్‌వీర్, దీపికల పెళ్ళి ఫిక్స్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు వినిపిస్తున్న వార్తలకైనా ఎప్పటిలా ‘అదేం లేద’నే సమాధానం చెపుతారా లేక కొత్త వార్తలేమైనా వినిపిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.