నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కేశాడు. ఆయనపై చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది. 'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్నారు. వైకింగ్ మీడియా సంస్థ బండ్ల గణేష్ కు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. వైకింగ్ మీడియా సంస్థకు హీరో సచిన్ జోషి ఎండి అని తెలుస్తోంది. 'ఆషికి 2' చిత్రాన్ని నీ జతగా నేనుండాలి పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే నీ జతగా నేనుండాలి సినిమాకీ గణేష్ ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పటికీ ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది సచిన్ జోషి. ఆ సినిమా విషయంలో గణేష్ తనని మోసం చేశాడని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని వైకింగ్ మీడియా ఫిర్యాదు చేసింది. సినిమా బాగానే ఆడినప్పటికీ లాభాల్లో వాటా ఇస్తానని చెప్పి, చివరికి నష్టాలు వచ్చాయని బండ్ల గణేష్ తప్పుడు లెక్కలు చూపినట్లు ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయాలపై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి...