విలక్షణ నటుడిపై వివాదాలు ఇంకెంత కాలం?

December 08, 2015 | 11:57 AM | 3 Views
ప్రింట్ కామెంట్
rao-ramesh-replaces-prakash-raj-in-rana-gajhi-niharonline

పరభాష నుంచి వచ్చినప్పటికీ ఆ ఛాయలు లేకుండా ఓ స్వచ్ఛమైన తెలుగు నటుడిగానే కొనసాగుతున్నాడు ప్రకాశ్ రాజ్. ఒకానోక సమయంలో హీరోలతో పాటు సమానమైన ప్రాధాన్యం అందుకున్న ఈ నటుడు ఆపై తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోతు వస్తున్నాయి. అతని ప్రవర్తన కారణంగా తరచు వివాదాలు కొనితెచ్చుకుంటూ ఇప్పడు పరిస్థితి ఇలా తయారు కావటానికి కారకుడు అయ్యాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఆగడు సమయంలో దర్శకుడు శీనువైట్లపై బహిరంగ విమర్శలు చేశాడు. అయితే ప్రకాశ్ రాజ్ అసిస్టెంట్ డైరక్టర్ పై చేయి చేసుకోవటంతోనే ఆ గొడవ మొదలైందని తర్వాత తెలిసింది. మరోవైపు కృష్ణవంశీతో కూడా చిన్నపాటి గొడవ జరుగగా గొవిందుడు అందరి వాడేలే కోసం చిరంజీవియే వీరిద్దరని కలిపాడు. అయితే ఇప్పటికీ వీరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది.

                            ఇలా ఇండస్ట్రీలో ఉన్న కొద్దిపాటి రిలేషన్ షిప్ ను పాడుచేసుకుంటూ అవకాశాలు లేకుండా పోతున్నాడు ప్రకాశ్ రాజ్. అయితే ఇప్పుడొస్తున్న కొందరు నటుల్లో ప్రకాశ్ రాజ్ కి ప్రత్యమ్నాయంగా భావిస్తున్న కొందరు నటుల కారణంగా ఆయనను మరీ పక్కన పడేస్తున్నారన్నది సత్యం. ప్రస్తుతం రానా హీరోగా ఘాజి అనే బహుభాషా  చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో ఓ ప్రధాన పాత్రకి ప్రకాశ్ రాజ్ ను ముందుగా అనుకున్నారు. అయితే తర్వాత ఆయనను తొలగించి ఆ ప్లేసులో రావు రమేష్ ను తీసుకున్నట్లు సమాచారం. ఘాజి నిర్మాణ సంస్థతో వైరం కారణంగానే ప్రకాశ్ ను చిత్రం నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన సొంత సినిమా 'మన ఊరి రామాయణం'పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రకాశ్ రాజ్ ఆ చిత్రాన్ని తిరస్కరించినట్లు సమాచారం. ఇక చిత్ర యూనిట్ ఏమో డేట్లు కుదరకపోవటంతోనే రావు రమేష్ ను తీసుకున్నట్లు ప్రకటించింది. మరి ఈ ప్రకటనల్లో ఏది నిజమో. ఫైనల్ గా ఒక్కటే నటనలో ప్రకాశ్ రాజ్ ను నటనలో కొట్టేవారు ఇప్పటికీ లేరు. అయితే తన పర్సనల్ క్యారెక్టర్ తో గొడవలు పెట్టుకుంటూ ఇలా వచ్చే అవకాశాలను కూడా చేజేతులారా పాడుచేసుకుంటూ ఇంకా ఎన్నిరోజులు ఇలా వార్తల్లో నిలుస్తాడో?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ