ప్రభాస్ లేకుండానే బాహుబలి సీక్వెల్!

December 07, 2015 | 03:20 PM | 4 Views
ప్రింట్ కామెంట్
prabhas-not-in-baahubali-3-niharonline

బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు ఎన్నో సృష్టించిన ఓ తెలుగు చిత్రం. త్వరలో రెండో పార్ట్ కూడా పట్టాలు ఎక్కబోతున్న సమయంలో షాకిచ్చే వార్త ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. అదేంటంటే బాహుబలి పార్ట్ 2 తర్వాత 3 కూడా ఉంటుందని రాజమౌళి గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందులో ప్రధాన పాత్రధారి అయిన ప్రభాస్, సినిమాకే ప్రాణం అయిన కట్టప్ప వంటి తదితర పాత్రలు లేకుండా చిత్రాన్ని తీయనున్నారట. ఈ విషయాన్ని చిత్ర కథారచయిత, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ స్వయంగా చెప్పారు.

ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం ఆయన బాహుబలి 3 కి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నా. ఇది చాలా కొత్తగా ఉంటుంది. గతంలో వచ్చిన సినిమాకి దానికి అసలు సంబంధం ఉండదు. ప్రధాన పాత్రధారితో సహా నటీనటులంతా కొత్తవారే అని తెలిపారు.

రాజమౌళి కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ, బాహుబలి 3 ని కూడా రూపొందించే ఫ్లాన్ ఉన్నట్టుగా చెప్పాడు. అయితే అది కొత్తగా, ప్రత్యేక ప్రపంచంగా అనిపించేలా రూపుదిద్దాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు కూడా.  ఇక ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ప్రకటనతో అది ఉండవచ్చన్న సంకేతాలు అందుతున్నాయి. మరి దానికి రాజమౌళియే దర్శకత్వం వహిస్తాడా? లేక తన తండ్రియే డైరక్ట్ చేస్తాడా అన్నది ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాదు అసలు పాత్రలు లేకుండా దానిని ఎలా తీస్తారో అన్న ఆసక్తి ఇప్పటి నుంచే మొదలౌతుంది. ప్రస్తుతానికైతే పార్ట్-2 ది కంక్లూజన్ మొదలైతే చాలు అన్న ఫీలింగ్ అందరిలోనూ ఉంది. ఎందుకంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియాలి కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ